టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న పెద్ద కుటుంబాల్లో ఒకటైన అక్కినేని కుటుంబం లో అత్యంత తెలివైన నటుడు ఎవరంటే ఇట్టే చెప్పే పేరు కింగ్ నాగార్జున.  కింగ్ బిరుదు ఎవరు ఇచ్చారో గాని ఆ నామధేయాన్ని సార్థకం చేస్తూ కేవలం రీల్ లైఫ్ లోనే కాకుండా నిజ జీవితంలో కూడా కింగ్ లా విలాసవంతమైన జీవితం గడపడంలో మిగిలిన  టాలీవుడ్ హీరోల కంటే ఎల్లప్పుడూ ముందుంటాడు. 



చెన్నై లోని ప్రముఖ గిండి ఇంజినీరింగ్ కళాశాలలో ఇంజినీరింగ్ పూర్తి చేసి అమెరికాలో ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ లో మాస్టర్స్ చేసిన నాగార్జునకి మొదటి నుంచి నటన కంటే వ్యాపారాల మీదే ఎక్కువ ఆసక్తి ఉండేది. కానీ తండ్రి వయస్సు పెరిగిన ఆయన్ని ప్రతి ఒక్కరు అభిమానించడం చూసిన తర్వాత సినీ గ్లామరస్ పట్ల ఆకర్షితుడై సినిమాల్లోకి రంగ ప్రవేశం చేశాడు. 



నటుడి గా పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత వ్యాపారాల జోలికి వెళ్లి 90వ దశకంలో నే పలు వ్యాపారాల్లో భాగస్వామ్యం తీసుకున్నారు. అప్పట్లో తను నటించే సినిమా రెమ్యునరేషన్ కంటే వ్యాపారాల్లోనే బాగా సంపాదించారు. తరువాత కాలంలో నాగార్జున బాటలోనే మిగిలిన హీరోలు వచ్చారు. ఒక వైపు సినీ ఇండస్ట్రీలో బిజీగా ఉంటూనే హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భూములు కొన్న నాగార్జున రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకున్న తర్వాత బాగా ఆర్జించారు అంటారు టాలీవుడ్ ఫిల్మ్ వర్గాలు. 

 

నాగార్జున రియల్ ఎస్టేట్ వ్యాపారం లో అంత భారీ లాభాలు సొంతం చేసుకోవడానికి కారణం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పాలించిన పలు పార్టీలతో  ఉన్న సన్నిహిత సంబంధాలు మరియు  ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి  జగన్ ఒకప్పటి వ్యాపార భాగస్వామి నిమ్మగడ్డ ప్రసాద్ లు ముఖ్యకారణాలు . తన స్నేహితుడైన  నిమ్మగడ్డ ద్వారా ఆనాటి ప్రభుత్వం లోని ముఖ్యలతో సన్నిహిత సంబంధాలు ఏర్పర్చుకున్నారు.  హైదరాబాద్ లో రింగ్ రోడ్డు ప్రాజెక్టులు అన్ని నాగార్జున కొన్న స్థలాల మీదగా వెళ్లడంతో ఆ భూములకు విపరీతంగా పెరిగిపోయి నాగార్జున భారీగా లబ్ధి పొందిన విషయం బహిరంగ రహస్యం  . ఇలా రాజకీయ అనుబంధాల వల్ల నాగార్జున కొన్ని వేల కోట్ల రూపాయిలు సంపాదించారు 

మరింత సమాచారం తెలుసుకోండి: