టాలీవుడ్ కమర్షియల్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివకి ఇప్పుడు టైం అసలు కలిసి రావడం లేదు. ఆయన తెరకెక్కించిన 'ఆచార్య' ఇంకా ఆయన్ను వదలడం లేదు. దాదాపు మూడు సంవత్సరాలు ఆచార్య ప్రాజెక్టు కొరటాల శివను ముప్పు తిప్పలు పెడుతుంది. ఆచార్య ని విడుదల చేసి కొత్త ప్రాజెక్టు పనులు చూసుకుందాం అంటే అస్సలు కుదరడం లేదు. కొరటాల శివ లాస్ట్ సినిమా 'భరత్ అనే నేను'.ఈ సినిమా 2018 లో విడుదలై సూపర్ సక్సెస్ను అందుకుంది. అదే జోష్ లో చిరంజీవితో 'ఆచార్య' సినిమాను ప్రకటించారు కొరటాల. పలు కారణాల చేత ఆచార్య సెట్స్ పై కి వెళ్ళడానికి సమయం తీసుకుంది.

ఇక అంతా ఓకే అనుకొని షూటింగ్ కి సిద్ధమయ్యాక కరోనా ఎంట్రీ ఇచ్చింది. దీంతో ఏడాది పాటు గ్యాప్ వచ్చింది. అలాగే ఒకసారి మెగాస్టార్ కరోనా బారిన పడ్డారు. ఆయన కోలుకున్నాక మళ్లీ సెకండ్ వేవ్ రావడం జరిగింది. మరోవైపు ఆచార్య మొత్తం షూటింగ్ పూర్తయ్యాక మళ్లీ కొన్ని సన్నివేశాలను రీషూట్ చేసారు. దాంతో ఆచార్య విడుదల తేదీ పలుమార్లు వాయిదా పడింది. ఫిబ్రవరి 4న విడుదల అని ప్రకటించిన చిత్ర బృందం మళ్లీ దాన్ని ఏప్రిల్1 మార్చారు. అదే రోజు మహేష్ బాబు సర్కారు వారి పాట విడుదల ఉంది. మరి అప్పటికైనా ఆచార్య విడుదల అవుతుందా? లేదా? అనే సందేహాలు కూడా ఉన్నాయి.

ఇలాంటి తరుణంలో ఇప్పుడు తాజాగా మరోసారి చిరంజీవి కరోనా బారిన పడ్డారు. దీంతో మరోసారి ఆచార్య విడుదల పోస్ట్ పో న్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు కొరటాల శివ వీలైనంత త్వరగా ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ను సెట్స్ పైకి తీసుకెళ్లాలని అనుకుంటున్నాడు. ఆచార్య సినిమా విడుదల చేసి ఎన్టీఆర్ మూవీ పనులు చూసుకుందాం అంటే ఇప్పుడు అనుకోని అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఎప్పుడు ఆచార్య సినిమా స్టార్ట్ చేసాడో కానీ.. ఇప్పటిదాకా ఈ ప్రాజెక్ట్ కు శుభం కార్డు పడట్లేదు. ఆచార్య గనుక ఏప్రిల్లో విడుదల కాని పక్షంలో అటు ఎన్టీఆర్ సినిమా కూడా మరింత ఆలస్యం అవుతుంది. అయితే ఇవన్నీ తెలిసిన కొంతమంది ఇండస్ట్రీ పెద్దలు ప్రస్తుతం కొరటాల శివ టైం ఏమీ బాలేదని అంటున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: