పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమా ఫిబ్రవరి 25వ తేదీన విడుదల కాబోతున్నట్లు గతంలో చిత్రబృందం అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే సినిమా తేదీ ప్రకటించగానే సినిమా విడుదల అవడానికి ఇది నార్మల్ రోజులు కావు. కరోనా రోజులు.. అందుకే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక అభిమానులు తమ అభిమాన హీరోల సినిమాల విషయంలో తెగ టెన్షన్ పడుతున్నారు. ఆ విధంగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్నారు భీమ్లా నాయక్ సినిమా కోసం. ఈ సినిమా ఫిబ్రవరి 25వ తేదీన విడుదల అవుతుందా లేదా అన్న అనుమానాలను వ్యక్తపరుస్తున్నారు. 

సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి త్రివిక్రమ్ రచయిత గా వ్యవహరించగా పవన్ సరసన నిత్యమీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంలో మరో స్టార్ హీరో రానా విలన్ గా నటిస్తూ ఉండగా ఆయన సరసన సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పాటలు ప్రేక్షకులను ఎంతో ఉర్రూతలూగించాయి. భారీస్థాయిలో అంచనాలను కూడా ఏర్పరచాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఫిబ్రవరి 25వ తేదీన విడుదల అవుతుంది అని మేకర్స్ నుంచి తెలుస్తుంది.

అప్పటివరకు పరిస్థితులు నార్మల్ అయ్యే విధంగా సూచనలు కనిపిస్తుండటంతో విడుదల తేదీ పోస్ట్ పోన్ చేసే ఆలోచనలో వారు లేనట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి క్రిష్ దర్శకత్వం వహిస్తుండగా కీరవాణి సంగీతం సమకూరుస్తున్నాడు. ఇక హరీష్ శంకర్ భవదీయుడు భగవద్గీత సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేస్తున్నాడు. తొందర్లోనే ఈ సినిమా షూటింగ్ కు వెళ్ల బోతుంది అని తెలుస్తుంది. మరి మేకర్స్ చెప్పిన మాట ప్రకారం ఫిబ్రవరి 25వ తేదీన పవన్ భీమ్లా నాయక్ సినిమాను విడుదల చేస్తాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: