ఉప్పెన సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమకు దర్శకుడిగా పరిచయమైన బుచ్చిబాబు పేరు ఇప్పుడు టాలీవుడ్ సినిమా పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారుతుంది. తొలి సినిమాతోనే ఇంతటి స్థాయిలో పాపులారిటీ దక్కించుకున్న ఈ దర్శకుడు తన తదుపరి సినిమాను పెద్ద హీరోతో మత్రమే సినిమా చేయాలని మొదటి నుంచి భావిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఎన్టీఆర్ తో సినిమా చేయాలని చెప్పి తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు. సుకుమార్ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన ఈ దర్శకుడు తన రెండవ సినిమాకే అగ్రహీరోతో పని చేయాలని భావించడం నిజంగా మంచి ఆలోచన అని చెప్పాలి.

కానీ హీరోలు పాన్ ఇండియా సినిమాలు చేసే రోజులలో ఈ దర్శకుడినీ ఎన్టీఆర్  నమ్మి సినిమా ఇస్తాడా లేదా అనేది ఇక్కడ అసలు విషయం. కథ విషయంలో ఆయనకు మంచి పట్టు ఉందని ఉప్పెన సినిమా విషయంలో తేలిపోయింది. అంతేకాదు దర్శకత్వంపై కూడా మంచి అవగాహన ఉన్నట్లు గా ఆయన వాడిన కొన్ని టెక్నిక్స్ ను బట్టి తెలుస్తుంది. ఆ విధంగా ఉప్పెన సినిమా హీరో హీరోయిన్స్ కు మాత్రమే కాదు ఈ దర్శకుడు కి కూడా భారీ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు తీసుకు వచ్చింది. 

అయితే ఈ సినిమా విడుదలై రెండు సంవత్సరాలు అవుతున్నా కూడా బుచ్చిబాబు తన రెండవ సినిమాను మొదలు పెట్టకపోవడం ఆయన అభిమానులను కాస్త నిరాశ పరుస్తుంది అని చెప్పవచ్చు. పెద్ద హీరోతో సినిమా చేయాలని బుచ్చిబాబు ఎన్టీఆర్ కోసం ఇన్ని రోజులు ఎదురు చూడగా ఆయన వరుసగా సినిమాలు చేసుకుంటూ పోవడంతో ఇక ఆయనతో సినిమా ఉండదేమోనన్న ఆలోచనకు బుచ్చిబాబు ఇప్పుడు వచ్చాడు. అయితే అల్లు అర్జున్ తో సినిమా చేసే విధంగా రంగం సిద్ధం చేసుకుంటున్నాడట బుచ్చిబాబు. పుష్ప సినిమా తో భారీ హిట్ కొట్టిన బన్నీ 100 కోట్ల హీరోగా మారిన నేపథ్యం లో ఆయన తో సినిమా చేస్తాడా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: