హీరోలే కాదు దర్శకులు కూడా ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు చేయాలని ఆ విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు. రాజమౌళి తర్వాత సుకుమార్ పాన్ ఇండియా మార్కెట్లో భారీ స్థాయిలో సక్సెస్ సాధించి ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు చేసే విధంగా కథలను సిద్ధం చేసుకుంటున్నాడు. మరొకవైపు పూరి జగన్నాథ్ కూడా లైగర్ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెడుతున్నాడు. ఆ విధంగా ఒక్కొక దర్శకుడు పాన్ ఇండియా మార్కెట్ లోకి వెళ్లే విధంగా సినిమాలు చేసుకుంటూ పోతే టాలీవుడ్ లో అగ్ర దర్శకులు గా ఉన్న ఓ ఇద్దరు మాత్రం ఆ సినిమాలను చేయాలన్న ఆలోచన కూడా చేయడం లేదు.

మాటల మాంత్రికుడు గా ప్రేక్షకులను తన రచనతో ఎంతగానో ఆకట్టుకున్న త్రివిక్రమ్ దర్శకత్వం తోనూ భారీ స్థాయిలో అలరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన ప్రస్తుతం చేస్తున్న సినిమాలన్నీ కూడా తెలుగు మార్కెట్ పరిధి వరకు ఉన్న కథలే కావడం ఆయనలో పాన్ ఇండియా సినిమా చేయాలనే ఆలోచన లేదని చెప్పడానికి కారణం అవుతుంది. మహేష్ బాబుతో తన తదుపరి సినిమా చేయబోతున్న త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని ఎక్కడ కూడా పాన్ ఇండియా మార్కెట్ సినిమా అని చెప్పకపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన ఎప్పుడూ పాన్ ఇండియా సినిమా చేస్తాడో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ఇకపోతే కొరటాల శివ కూడా పాన్ ఇండియా సినిమా చేసే విధంగా ఆలోచనలు చేయకపోవడం ఆయన అభిమానులను నిరాశ పరుస్తుంది. ప్రస్తుతం చేస్తున్న ఆచార్య సినిమా పాన్ ఇండియా సినిమా కాదు. ఎన్టీఆర్ తో ఆయన చేసే సినిమా కూడా పాన్ ఇండియా సినిమా అని ఎక్కడా చెప్పలేదు. దాంతో ఎన్టీఆర్ అభిమానులు సైతం కొరటాల శివ ఈ విధంగా చేస్తుండడం పట్ల కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా మార్కెట్ లోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో కొరటాల శివ ఎందుకు పాన్ ఇండియా లెవెల్ లో సినిమా చేయడం లేదు అని ప్రశ్నిస్తున్నారు. మరి అందరి దర్శకుల లాగానే వీరు కూడా పాన్ ఇండియా సినిమాలు చేసే విధంగా ముందుకు పోతారా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: