అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్, రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన నేను శైలజ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా మంచి విజయం సాధించడంతో టాలీవుడ్ లో కీర్తి సురేష్ కు మంచి క్రేజ్ ఏర్పడింది, అయితే ఆ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మహానటి సినిమాతో  కీర్తి సురేష్ కు టాలీవుడ్ లో ఎనలేని పేరు ప్రతిష్టలను దక్కాయి. అయితే ఆ తర్వాత నుండి కీర్తి సురేష్ కేవలం కమర్షియల్ సినిమాలలో మాత్రమే కాకుండా తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న లేడి ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా నటించడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తోంది, అందులో భాగంగా ఇప్పటికే కీర్తి సురేష్ పెంగ్విన్, మిస్ ఇండియా లాంటి లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటించింది,  ఇదిలా ఉంటే ప్రస్తుతం కూడా కీర్తి సురేష్ గుడ్ లక్ సఖి అనే సినిమాలో కూడా నటిస్తుంది, ఈ సినిమా మా జనవరి 28 వ తేదీన విడుదల కాబోతుంది.  

ఈ సినిమాతో పాటు మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బోళా శంకర్ సినిమాలో కీర్తి సురేష్, చిరంజీవి కి చెల్లెలి పాత్రలో నటిస్తోంది,  ఇలా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న కీర్తి సురేష్ తాజాగా యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించింది,  ఈ విషయాన్ని కీర్తి సురేష్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది, ఈరోజు నా అధికారిక యూట్యూబ్ ఛానల్‏ను ప్రారంభించినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది, సబ్ స్కైబ్ చేసి వీడియోలు చూడండి అంటూ కీర్తి సురేష్ సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. ఇది ఇలా ఉంటే కీర్తి సురేష్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అనేక విషయాలను తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది, అలాగే ఈ ముద్దుగుమ్మ తన షూటింగ్ అప్డేట్ లను ఇతర విషయాలను కూడా సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: