మాస్ మహారాజా రవితేజ పోయిన సంవత్సరం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో శృతి హాసన్ హీరోయిన్ గా తెరకెక్కిన క్రాక్ సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు, ఈ సినిమా ఇచ్చిన జోష్ లొనే రవితేజ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తున్నాడు. అందులో భాగంగా ప్రస్తుతం రవితేజ నటిస్తున్న సినిమా ఖిలాడి,  ఈ సినిమాకు రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో రవితేజ సరసన డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా నటిస్తున్నారు, ఇప్పటికే ఈ సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి జనాల నుండి అదిరిపోయే రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా ఈ సినిమాపై ఇప్పటికే ఉన్న అంచనాలను అమాంతం పెంచేశాయి,  ఇలా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగివున్న ఈ సినిమాను  ఫిబ్రవరి 11 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు కొన్ని రోజుల క్రితమే చిత్ర బృందం అఫీషియల్ గా  ప్రకటించింది. 

అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది,  ఖిలాడి సినిమాను తెలుగుతో పాటు హిందీ భాషలో కూడా విడుదల చేయాలని చిత్ర బృందం ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి, ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు ఈ వార్త పై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. రవితేజసినిమా తో పాటు రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో కూడా నటిస్తున్నాడు, ఈ సినిమాలో రవితేజ పవర్ ఫుల్ ఎమ్మార్వో ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది, అలాగే మాస్ మహారాజా రవితేజ ఈ సినిమాలతో పాటు త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ధమాకా సినిమాలో మరియు సుధీర్ వర్మ దర్శకత్వంలో రావణాసుర సినిమాలో నటించడానికి రెడీగా ఉన్నాడు, అలాగే టైగర్ నాగేశ్వర్ రావు సినిమాలో కూడా రవితేజ నటించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: