కొంత మందికి అదృష్టం ఎలా ఉంటుంది అంటే.. వాళ్లు ఏ సినిమా చేయకపోయినా.. విపరీతమైన క్రేజ్ వస్తుంటుంది. మరి కొందరికీ సినిమాలు విడుదల అయి.. భారీ స్థాయిలో సక్సెస్ అయితే.. ఓవర్ నైట్‌లో స్టార్ హీరోయిన్‌గా మార్క్ వేసుకుంటారు. సినిమా షూటింగ్ సమయంలో, లేదా సినిమా ఓపెనింగ్ సమయంలో తమ అందచందాలతో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంటారు. కొందరు తమ నటనతో అందరినీ ఆకట్టుకుంటుంటే.. మరికొందరు తమ అందచందాలతో మెప్పిస్తుంటారు.



టాలీవుడ్‌లో హీరోయిన్స్ గా అరంగేట్రం చేయకన్న ముందే భారీ స్థాయిలో పాపులారిటీ సంపాదించుకున్న కొందరు సోషల్ మీడియా స్టార్స్, అప్ కమింగ్ హీరోయిన్స్ గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘భీమ్లా నాయక్’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న సంయుక్త మీనమ్ ఇప్పటివరకు తెలుగులో ఒక్క సినిమా కూడా చేయలేదు. భీమ్లా నాయక్ సినిమానే తన ఫస్ట్ మూవీ. కానీ ప్రస్తుతం ఆమెకున్న క్రేజ్ మామూలుగా లేదు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ భామ.. ప్రతి రోజు తన ఫోటోలను, తన డైలీ ఈవెంట్స్ ని పోస్ట్ చేస్తుంటారు. అయితే భీమ్లా నాయక్ సినిమాలో ఈ ముద్దుగుమ్మ బాగా నటించిందని పేరు రావడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈమె పేరు మార్మోగుతోంది.  



అలాగే మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న ‘కిలాడి’ మూవీలో హీరోయిన్ నటిస్తున్న డింపుల్ హయాతి కూడా విపరీతమైన క్రేజ్ పెరిగింది. గతంలో కొన్ని సినిమాల్లో ఆమె నటించిన.. ఊహించిన స్థాయిలో మంచి పేరు, గుర్తింపు రాలేదు. కానీ కిలాడి సినిమాతో ఈ ముద్దుగుమ్మకు మంచి క్రేజ్ వచ్చింది. సినిమా రిలీజ్ కాకుండానే మంచి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్నారు. అయితే డింపుల్ హయాతి కూడా సోషల్ మీడియాలో తన ఫోటోలు షేర్ చేస్తుంటారు. హాట్ ఫోటోలు షేర్ చేస్తూ.. నెట్టింట వైరల్ అవుతుంటారు.


అలాగే మీనాక్షి చౌదరి కూడా మంచి పాపులారిటీ తెచ్చుకుంది. తన అందచందాలతో సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూ నెటిజన్లను అలరిస్తుంటారు. ఈ ముద్దుగుమ్మ నటిస్తున్న సినిమాలో ఆమెకు పాజిటివ్ టాక్ వల్ల.. మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది. సినిమా రిలీజ్ కాకున్న.. సోషల్ మీడియా స్టార్స్ గా రాణిస్తూ మంచి క్రేజ్ సొంతం చేసుకున్న వారు చాలా మంది ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: