క‌బీర్ ఖాన్ గ‌తంలో ఎన్నో అద్భుత‌మైన‌ గొప్ప చిత్రాల‌ను నిర్మించాడు. బాక్సాఫీస్ వ‌ద్ద చాలా విజ‌య‌వంతం అయ్యాయి. అయితే ఇటీవ‌ల ఆయ‌న చేసిన 83 చిత్రం మాత్రం ప్రేక్ష‌కుల హృద‌యాల్లో విభిన్న‌మైన స్థానాన్ని సంపాదించుకున్న‌ది. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద చాలా మంచి వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. అయితే ఈ సినిమాలో ర‌ణ‌వీర్‌సింగ్‌, దీపికా ప‌దుకొణెల మ‌ధ్య కెమిస్ట్రీ అంద‌రికీ చాలా బాగా న‌చ్చింది. వీరిద్ద‌రితో పాటు ఇత‌ర న‌టీన‌టులు కూడా అద్భుతంగా న‌టించారు. ఈ చిత్రం మాత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా విభిన్న‌మైన ముద్ర వేసింది. భార‌త్ కు తొలి ప్ర‌పంచ క‌ప్ నేప‌థ్యంలో రూపొందించిన ఈ చిత్రం చాలా ప్ర‌శంస‌లు అందుకుంది. కానీ భార‌త్‌లో మాత్రం ఆశించినంత  మేర‌కు ఆక‌ట్టుకోక‌పోవ‌డం విశేషం.

క‌బీర్‌ఖాన్ 83 ప్ర‌పంచ వ్యాప్తంగా సంద‌డి చేస్తున్న‌ది. ర‌ణ‌వీర్‌సింగ్, దీపికా ప‌దుకొణె న‌టించిన ఈ స్పూర్తి దాయ‌క‌మైన స్పోర్ట్స్ డ్రామా డిసెంబ‌ర్ 24న విడుద‌ల అయింది ఇప్ప‌టికీ ప్ర‌పంచ వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో త‌న ప‌ట్టును కొన‌సాగిస్తూనే ఉన్న‌ది. ప్ర‌ముఖ చిత్ర నిర్మాత ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన మాగ్న‌మ్ ఓప‌స్ 2021లో 31 రోజుల్లో 62.54 కోట్లు రాబ‌ట్టి.. 2021లో అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన భార‌తీయ చిత్రంగా ప్ర‌పంచ బాక్సాఫీస్ వ‌ద్ద చరిత్ర సృష్టించింది. నైట్ క‌ర్ప్యూ ఉండ‌డంతో 50 శాతం ఆక్యుపెన్సీ ఎంపిక చేసిన ప్ర‌ధాన కేంద్రాల్లో సింగిల్ స్క్రీన్‌లు మ‌ల్టీప్లెక్స్‌ల‌ను మూసివేయ‌డం వంటి భారీ అడ్డంకులున్న‌ప్ప‌టికీ 83 ప్ర‌పంచ బాక్సాఫీస్ వ‌ద్ద ఆక‌ట్టుకునే నెంబ‌ర్‌లు సాధించ‌డం విశేషం.

చిత్ర బృందం చెప్పిన‌ట్టుగా 83 భార‌తీయ సినిమా నుంచి గొప్ప చిత్రం మాత్ర‌మే కాదు ఇది ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికుల హృదయాల్లో నివ‌సించే భావోద్వేగం అనే చెప్ప‌వ‌చ్చు. ఈ సంద‌ర్భంగా క‌బీర్ ఖాన్ మీడియాతో ముచ్చ‌టించారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి ల‌భించిన ప్రేమ‌, ప్ర‌శంస‌లు నిజంగా హృద‌య‌పూర్వ‌కంగానే ఉన్నాయి. కొవిడ్‌-19 పరిమితులు లేని ద‌గ్గ‌ర థియేట‌ర్లు పూర్తి సీటింగ్ కెపాసిటీతో న‌డుస్తున్న ద‌గ్గ‌ర ఈ సినిమా మంచి వ‌సూళ్ల‌నే సాధించిన‌ది. 83 చిత్రం భార‌తీయ సినిమా అత్యంత ప్ర‌సిద్ధ చిత్రాల‌లో ఒక‌టిగా భావిస్తున్నందుకు సంతోషిస్తున్నాన‌ని క‌బీర్‌ఖాన్ తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: