సినిమా అనేది ఒక మాయా ప్రపంచం.. ఇందులో నిలబడాలి అంటే సినిమాలు సక్సెస్ అవ్వాలి. లేకుంటే ఇక్కడ వచ్చే సునామి లకు తట్టుకోవటం చాలా కష్టం.. సినిమాలు హిట్ అయితేనె అక్కడ పేరు వుంటుంది. లేకుంటే మాత్రం కథ మళ్ళీ మొదటికి వస్తుంది. మంచి ఇమేజ్ ఉన్నప్పుడే వరుస సినిమాలలో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఈ మధ్య కాలం లో అందరూ అదే ఫాలో అవుతున్నారు.ప్రస్తుతం ప్రతి ఒక్క హీరో తగ్గేదేలేదు అన్నట్లుగా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఎవరు ఎన్ని సినిమాలతో ఫుల్ బిజిగా ఉన్నారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. కానీ రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మాత్రం ఫుల్ స్పీడ్ తో దూసుకుపోతున్నాడు. ఒక్కో సినిమాకి 50 కోట్ల రెమ్యూనరేషన్ వసూలు చేసే పవన్ కళ్యాణ్ కోసం దర్శక నిర్మాతలు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరో వైపు రాజకియాల్లొ చురుగ్గా ఉన్నారు. రెండూ బ్యాలెన్స్ చేయడం పవన్ కు మాత్రమే సాధ్యం..
ఇకపోతే బాహుబలి తో స్టార్ హీరో అయిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుస సినిమాలను చెస్తున్నారు.. రాధేశ్యామ్ విడుదల కు సిద్దంగా ఉండగా తర్వాత సలార్, ఆది పురుష్ ప్రాజెక్ట్ కె, స్పిరిట్ లాంటి పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు ప్రభాస్.


అలాగే రవి తేజ కూడా అలానే ఫాలో అవుతున్నారు.కిలాడి, ధమాకా,రామారావు ఆన్ డ్యూటీ, టైగర్ నాగేశ్వరరావు, రావణాసుర వంటి సినిమాలతో బిజీ బిజీగా మారిపోయాడు రవి తేజ.. కాగా,మెగాస్టార్ చిరంజీవి ఈ వయస్సులో కూడా అదే జోష్ లో వరుస సినిమాలను చెస్తున్నారు.కొరటాల శివ తో ఆచార్య సినిమాలో నటిస్తున్న మెగాస్టార్ చిరంజీవి యువ దర్శకుడు బాబీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. మెగాస్టార్ కూడా రెమ్యునరేషన్ భారీగానే పెంచేసాడట. ఇక నాని, మహేష్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో లు కూడా అదే ఫాలో అవుతున్నారు. వరుస సినిమాలను చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: