ప్రస్తుతం తెలుగు బుల్లితెర పై టాప్ యాంకర్ గా కొనసాగుతుంది యాంకర్ సుమ. రెండు దశాబ్దాల నుంచి కూడా స్టార్ యాంకర్ గా కొనసాగుతున్న సుమ తనకు తిరుగులేదని నిరూపించుకుంది. తన వాక్చాతుర్యంతో ప్రేక్షకులను కట్టిపడేస్తూ ఉంటుంది సుమా. సుమా ఏదైనా కార్యక్రమాన్ని నిర్వహించింది అంటే ఆ కార్యక్రమం సూపర్ హిట్ కావడం ఖాయం అని అనుకుంటూ ఉంటారు అందరూ. ఎలాంటి వల్గారిటీ లేకుండా తనదైన వాక్చాతుర్యంతో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఇక ఇండస్ట్రీలో ఎంతో మంది యాంకర్లకు ఆదర్శంగా కూడా నిలుస్తుంది సుమ. ఇకపోతే యాంకర్ సుమ కేవలం బుల్లితెరపై కార్యక్రమాలు మాత్రమే కాదు అటు సినిమా ఈవెంట్లు కూడా వరుసగా చేస్తూ ఉంటుంది.


 ఏదైనా స్టార్ హీరోలకు సంబంధించిన సినిమా విడుదల అయింది అంటే చాలు ఇక అన్ని రకాల ఈవెంట్ లలో  కూడా సుమ వ్యాఖ్యాతగా అవతారమెత్తుతు ఉంటుంది. అయితే ప్రస్తుతం టాప్ యాంకర్ గా కొనసాగుతున్న సుమ రెమ్యూనరేషన్ గురించి ఎప్పుడూ ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటాయి. స్టార్ హీరోల సినిమాల ఈవెంట్లకు సుమ ఏకంగా ఐదు లక్షలకు పైగానే పారితోషికం డిమాండ్ చేస్తూ ఉంటుందని ఎప్పుడు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక హీరో లను బట్టి రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తూ ఉంటుంది అంటూ వార్తలు ఎప్పుడూ వైరల్ గా మారిపోతూ ఉంటాయి.


 ఇకపోతే ఇటీవల కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన గుడ్ లక్ సఖి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి వ్యాఖ్యాతగా వ్యవహరించింది సుమ. అయితే సుమ రెమ్యూనరేషన్ గురించి నిర్మాత స్టేజ్ మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గుడ్ లక్ సఖి సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్ గా నిర్మాతగా వ్యవహరించిన శ్రావ్య వర్మ మాట్లాడుతూ తనకోసం యాంకర్ సుమ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నే ఈవెంట్కి వచ్చింది అంటూ అసలు విషయాన్ని చెప్పేశారు. ఇక శ్రావ్య తన స్పీచ్ ముగించి స్టేజ్ దికి వెళ్తున్న సమయంలో ఇంకా కాసేపు ఉంటే నా ఆస్తుల వివరాలు కూడా చెప్పే దానివి అంటూ కౌంటర్ వేసింది. దీంతో అందరూ నవ్వుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: