పెళ్లి తర్వాత చాలామంది హీరోయిన్లు హీరోయిన్‌ సెంట్రిక్ మూవీస్ వైపు వెళ్తుంటారు. రెగ్యులర్ కమర్షియల్‌ మూవీస్‌కి బ్రేక్‌ ఇస్తుంటారు. అయితే దీపిక పదుకొణే మాత్రం పెళ్లి తర్వాత కూడా బాలీవుడ్ టాప్ పొజిషన్‌ని కంటిన్యూ చేస్తూ, మునుపటిలాగే అన్ని రకాల పాత్రలు పోషిస్తోంది. అయితే శకున్ బాత్రా దర్శకత్వంలో చేసిన 'గెహరాయియా' సినిమాతో దీపిక విమర్శల్లో పడింది.

దీపిక పదుకొణే, సిద్ధాంత్ చతుర్వేది, అనన్యా పాండే, ధైర్య లీడ్‌ రోల్స్‌లో రూపొందింది 'గెహరాయియా'. ఈ సినిమా ఫిబ్రవరి 11న డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ అవుతోంది. రీసెంట్‌గా ఈ సినిమా నుంచి "డూబే" అనే సాంగ్ విడుదలైంది. ఇక ఈ పాటలో దీపిక చాలా బోల్డ్‌గా కనిపించింది. సిద్ధాంత్‌తో లిక్‌ లాక్‌లు, ఇంటిమసీ సీన్స్‌లో రియలిస్టిక్‌గా నటించింది. దీపిక పదుకొణే బోల్డ్‌గా కనిపించడంతో చాలామంది షాక్‌ అవుతున్నారు. పెళ్లి తర్వాత ఇలాంటి సీన్స్‌ చేయడమేంటి..ఆ లిప్‌లాకులు ఏంటి.. బెడ్‌ రూమ్ సీన్స్ ఏంటి.. రణ్‌వీర్‌ సింగ్‌ చూస్తే హార్ట్‌ ఎటాక్‌ వస్తుందని ట్రోల్‌ చేస్తున్నారు. కొంతమందైతే ఈ సినిమాతో రణ్‌వీర్, దీపిక మధ్య డిస్ట్రబెన్సెస్‌ మొదలయ్యాయని కామెంట్ చేస్తున్నారు.

ఐశ్వర్యా రాయ్‌ కూడా ఇంతకుముందు ఇలాంటి విమర్శలు ఎదుర్కొంది. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ పెళ్లికి ముందు 'ధూమ్2' విడుదలైంది. ఈ మూవీలో హృతిక్ రోషన్‌, ఐష్‌ మధ్య డీప్‌ లిప్‌లాక్‌ సీన్స్‌ ఉన్నాయి. ఈ సీన్స్‌తో బచ్చన్‌ ఫ్యామిలీ హర్ట్ అయ్యిందని, అభిషేక్, ఐష్‌ విడిపోతున్నారనే ప్రచారం జరిగింది. కానీ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీళ్లకి ఒక కూతురు కూడా ఉంది. అంతే కాదు ఐశ్వర్య అమ్మ అయ్యాక 'యే దిల్ హై ముష్కిల్'లో బోల్డ్‌ రోల్‌ ప్లే చేసింది. సో రణ్‌వీర్, దీపిక కూడా ఇలాగే సినిమాలని, జీవితాలని సెపరేట్‌గానే చూస్తున్నారని, ఎలాంటి గొడవలు లేవని మరికొంతమంది అంటున్నారు. మొత్తానికి దీపిక పదుకొనే కుర్రకారు గుండెల్లో గుబులు రేపుతోంది.

   
   

మరింత సమాచారం తెలుసుకోండి: