సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప సినిమా ఎంత బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం తెలుగులో మాత్రమే కాదు అటు హిందీలో కూడా సత్తా చాటి భారీ వసూళ్లను సాధించి రికార్డులు కొల్లగొట్టింది. ఇక పుష్ప సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి కూడా ఎంతగానో గుర్తింపు వచ్చింది అని చెప్పాలి. సాధారణంగా చిత్ర పరిశ్రమలో ఒక హీరో చేయాల్సిన సినిమాలు మరొకరరూ చేసి హిట్టు అందుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక పుష్ప సినిమా విషయంలో కూడా ఇదే జరిగిందట. మరి పుష్ప సినిమాను వదులుకున్న నటులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.


 పుష్ప కథను ముందుగా సుకుమార్ మహేష్బాబుతో చేయాలనుకున్నాడు అంటూ టాక్ ఉంది. కానీ లుక్స్ పరంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడం అదే సమయంలో మహేష్ బాబు బిజీగా ఉండడంతో ఇక అల్లు అర్జున్ తో పుష్ప సినిమా తీసేశారట సుకుమార్.

 సమంత : పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్రలో నాచురల్ నటనతో ఆకట్టుకుంది రష్మిక మందన. అయితే ముందుగా ఈ పాత్ర కోసం సమంత ని అనుకున్నారట. రంగస్థలం సినిమాలో రామలక్ష్మి గా మెప్పించిన సమంతను శ్రీవల్లి గా చూపించాలని అనుకున్నారట. కానీ సమంత నో చెప్పడంతో చివరికి రష్మిక కు ఈ ఆఫర్ దక్కింది.

 దిశా పటాని : సినిమాలో సమంత చేసిన ఊ అంటావా సాంగ్ ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పుష్ప సినిమా హిట్ అవడానికి ఈ సాంగ్ ఎంతో ప్లేస్ అయింది. అయితే ముందుగా సమంతను కాకుండా దిశాపటాని, బాహుబలి ఫేమ్ నోరా ఫతేహి నీ ఈ సాంగ్ లో నటింపజేయాలని అనుకున్నారట. భారీ పారితోషికం అడగడంతో చివరికి సమంతను ఐటమ్ సాంగ్ కోసం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

 విజయ్ సేతుపతి : ఉప్పెన సినిమాతో విలన్ గా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన విజయ్ సేతుపతి అందరిని ఆకర్షించాడు. అయితే ఆ సినిమాలో ఫాహద్ ఫాజిల్ నటించిన భన్వర్లాల్ షికావత్ పాత్ర విజయ్ సేతుపతి చేయాల్సిందట. వేరే ప్రాజెక్ట్ తో బిజీగా ఉండడంతో డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో చివరికి ఫహడ్ ఫాజిల్ ఈ ఛాన్స్ కొట్టేసాడు. అయితే అంతకు ముందు బెంగాలీ నటుడు జిష్ణు సేన్ గుప్తా, టాలీవుడ్ హీరో నారా రోహిత్ లను కూడా ఈ పాత్ర కోసం సంప్రదించినట్లు టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: