శంక‌ర్ సినిమాలు అంటేనే భారీత‌నం నిండి ఉంటుంది.భార‌తీయం కూడా నిండి ఉంటుంది. అవును! ఆయ‌న సినిమాలు సాంకేతికంగా ఉన్న‌తంగా ఉంటాయి.ఆయ‌న సినిమాల స్థాయిని నిర్ణ‌యించేంత శ‌క్తి ఎవ్వ‌రికీ లేదు. అంత బాగా ఉంటాయి. సాంకేతికంగానే కాదు క‌థాప‌రంగానూ ఆయ‌న సినిమాలు చాలా అంటే ఉన్న‌త స్థాయిని పొంది ఉంటాయి.ఒక దానితో ఒక‌టి పోటీ ప‌డుతుంటాయి ఆయ‌న సినిమాలు.ముఖ్యంగా సామాజిక స్పృహ అన్న‌ది పుష్క‌లంగా ఉంటుంది ఆయ‌న క‌థ‌లో! అస‌లు ఆయ‌న ఏ సినిమా తీసినా కూడా సామాజిక స్పృహ, పౌరుల నిర్ల‌క్ష్యం, నాయ‌కుల వైఖ‌రి, అవినీతి,బంధు ప్రీతి వీటి చుట్టూనే ఆయ‌న క‌థ‌లు ఉంటాయి.మొద‌ట్లో కొన్ని ప్రేమ క‌థ‌లు తీశారు.వాటిలోకూడా రిచ్ నెస్ ను ఎక్క‌డా త‌గ్గించ‌లేదు.



జీన్స్, ప్రేమికుడు లాంటి సినిమాలు ఆయ‌న స్థాయిని ఆ రోజే నిరూపించాయి.ఆయ‌న కొత్త‌దనానికి ఎంత ప్రాధాన్యం ఇస్తారో, సంగీతానికి ఎంత‌టి విలువ ఇస్తారో అన్న‌ది నిరూప‌ణ అయింది. తాజాగా రామ్ చ‌ర‌ణ్ తేజ్,కియారా అడ్వానీ కాంబినేష‌న్ లో ఆయ‌న ఓ సినిమా రూపొందిస్తున్న సంగ‌తి తెలిసిందే! ఈ సినిమాను క్రేజీ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఓ లేటెస్ట్ అప్డేట్ వ‌చ్చింది.



చెర్రీ హీరోగా న‌టిస్తున్న 15 వ చిత్ర‌మిది కావ‌డం, శంక‌ర్  ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతుండ‌డంతో దిల్ రాజు బ‌డ్జెట్ కు ఎక్క‌డా లోటు పెట్ట‌క‌పోయినా ఓ అడ్డేట్ మాత్రం చాలా ఆస‌క్తిగానే ఉంది. అదేంటంటే త్వ‌ర‌లో రామ్ చ‌ర‌ణ్ , కియారా అడ్వానీపై చిత్రీక‌రించే పాట‌కు 25 కోట్లు వెచ్చించ‌నున్నార‌ని స‌మాచారం. జ‌పాన్ లో షూట్ చేయ‌నున్న ఈ పాట‌కు సంబంధించిన ఈ అప్డేట్ ఇండ‌స్ట్రీలో ఎందరినో ఆందోళ‌న‌కు గురి చేస్తుంది. గ‌తంలో శంక‌ర్ సినిమాల‌న్నింటినీ దాదాపు ఏఎం ర‌త్న‌మే నిర్మించారు.రోబో మాత్రం స‌న్ పిక్చ‌ర్స్ ప‌తాకంపై క‌రుణానిధి మ‌న‌వ‌లు ద‌యానిధి మార‌న్,త‌దిత‌రులు నిర్మించారు. ఆ సినిమా కూడా భారీ చిత్ర‌మే
అయిన‌ప్ప‌టికీ ఇంత‌గాఖ‌ర్చు చేయ‌లేదు.



సినిమా వ‌ర‌కూ ఐశ్వ‌ర్య రెమ్యున‌రేష‌నే హైలెట్. కానీ ఇక్క‌డ అలా కాదు  చాలాడ‌బ్బు వెచ్చించి షూట్ పార్ట్ తీస్తున్నారు. సినిమాకు ఇంత‌టిభారీ బ‌డ్జెట్ ఎందుకు అవ‌స‌రం అవుతుందో కూడా ఎవ్వ‌రూ చెప్ప‌లేక‌పోతున్నారు. ఈ సినిమాకు థ‌మ‌న్ సంగీతం అందిస్తుండ‌గా, మిగ‌తా సాంకేతిక బృందమంతా జాతీయ స్థాయిలో పేరున్న  వారే కావ‌డం విశేషం. ఇవ‌న్నీ క‌ల‌గ‌లిపి చిత్ర నిర్మాణ స్థాయిని పెంచుతున్నాయ‌న్న‌ది టాలీవుడ్ మాట. ఒక‌వేళ సినిమా ఎత్తిపోతే..అప్పుడు ఏం కావాలి నిర్మాత? గ‌తంలో రోబో 2 విష‌య‌మై ఇలానే జ‌రిగింది. ఆ సినిమా ఆశించిన విజ‌యం సాధించ‌లేక నిర్మాణ సంస్థ ఏరోస్ ఇంట‌ర్నేష‌న‌ల్ ను నిలువునా ముంచింది. ఇప్పుడు కూడా అదే భ‌యం  దిల్ రాజు వ‌ర్గాల్లో ఉన్నా డైరెక్ట‌ర్ శంక‌ర్ కు ఎదురు చెప్ప‌లేక‌పోతున్నారు అని స‌మాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: