శ్యామ్ సింగరాయ్.. కలకత్తా నేపధ్యంలో పీరియాడికల్ పవర్ ఫుల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన చిత్రం ఇది. నిహారిక ఎంటర్టైన్మెంట్ పతాకంపై బోయనపల్లి వెంకట్ ఈ సినిమాను నిర్మించారు.. ఇక ఇందులో నాచురల్ స్టార్ హీరో నాని కీలక పాత్ర పోషించగా సాయి పల్లవి లీడ్ రోల్ పోషించారు.. ఇక కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ లు కూడా హీరోయిన్ లుగా నటించారు. ఈ సినిమాకి రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వం వహించగా మిక్కీ జే మేయర్ సంగీత దర్శకుడిగా పనిచేశారు.. మొదట ఈ సినిమా ఎన్నో విమర్శలను ఎదుర్కొంది.. అంతేకాదు ఈ సినిమాతో మళ్లీ ఫెయిల్యూర్ ను చవి చూడాల్సి వస్తుంది ఏమో అన్న భయం కూడా నాని లో మొదలవడం జరిగింది.


సినిమా విడుదలైన తర్వాత ప్రపంచ రికార్డు సృష్టించడం చూసి నాని సైతం ఆశ్చర్యపోతున్నారు. డిసెంబర్ - 24 -2021 న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదలై విశేష ప్రేక్షకాదరణ పొందింది ..అంతేకాదు 2022 జనవరి 21వ తేదీ నుంచి ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్ ఫ్లెక్స్ సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ సినిమాలో పునర్జన్మ ఉంటుంది అనే విషయాన్ని చాలా చక్కగా చూపించారు.. ఇక సాయి పల్లవి డాన్స్ చూసి సాధారణంగా ఎంతోమంది ఈమె డాన్స్ కు అభిమానులు ఉన్న విషయం తెలిసిందే.. కానీ ఈ సినిమాలో ఆమె డాన్స్ కి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఫిదా అవ్వడం అంటే అతిశయోక్తి కాదు.


ఇక ఈ సినిమా థియేటర్లలో ఇటు ఓటీటీ వేదికగా  ప్రసారం అవుతూ ఉండగా ఎక్కువమంది వీక్షించిన సినిమాగా ప్రపంచ రికార్డ్స్ లో చోటు సంపాదించుకోవడమే  కాకుండా ఏకైక భారతీయ సినిమాగా గుర్తింపు తెచ్చుకోవడం గమనార్హం.ఇకపోతే శ్యామ్ సింఘరాయ్  సినిమా అత్యధికంగా వీక్షించబడిన భారతీయ చలనచిత్రం అలాగే ప్రపంచవ్యాప్తంగా టాప్ 3 జాబితాలోకి ప్రవేశించిన ఏకైక భారతీయ చిత్రంగా రికార్డు సృష్టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: