యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా పనులన్నీ ముగించుకున్నడు, ఈ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా హీరోగా నటించాడు, ఇప్పటికే ఈ సినిమాను జనవరి 7 వ తేదీన విడుదల చేయాలని చిత్ర బృందం అనుకుంది. దానికి తగ్గట్టుగా ఈ సినిమా ప్రమోషన్ లను కూడా చిత్ర బృందం పాన్ ఇండియా రేంజ్ లో చేసింది, ఈ సినిమా విడుదల తేది దగ్గర పడుతున్న కొద్దీ దేశంలో కరోనా కేసులు ఉధృతంగా పెరుగుతుండడంతో ఈ సినిమా విడుదలను చిత్ర బృందం వాయిదా వేసింది.

  అయితే కొన్ని రోజుల క్రితమే ఆర్ఆర్ఆర్ సినిమాను మార్చి 18 వ తేదీన లేదా ఏప్రిల్ 28 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అఫీషియల్ గా ప్రకటించింది, ఆర్ఆర్ఆర్ సినిమా పనులన్నీ ముగించుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం తన తదుపరి సినిమాల పై ఫోకస్  పెట్టినట్లు తెలుస్తోంది.  ఎన్టీఆర్,  ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమాలో నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే, ఈ సినిమా షూటింగ్ మరి కొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది, ప్రస్తుతం దర్శకుడు కొరటాల శివ కూడా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఆచార్య సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు.  వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో జనతాగ్యారేజ్ సినిమా వచ్చింది, ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది, ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్  'కేజిఎఫ్' సినిమాతో  పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటించబోతున్నాడు,  అలాగే ఈ సినిమా పూర్తయిన వెంటనే తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో ఒక సినిమాలో నటించబోతున్నట్లు తెలుస్తోంది, ఇలా ఎన్టీఆర్, ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత అదిరిపోయే సినిమాల లైన్ అప్ ని సెట్ చేసి పెట్టుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: