యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే, అందులో భాగంగా ప్రభాస్ ఇప్పటికే రాదే శ్యామ్  సినిమాను పూర్తి చేశాడు,  ఈ సినిమాకు రాధా కృష్ణ దర్శకత్వం వహించగా పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది, ఇప్పటికే ఈ సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి జనాల నుండి అదిరిపోయే రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా ఈ సినిమాపై ఇప్పటికే ఉన్న అంచనాలను అమాంతం పెంచేశాయి, ఇలా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమాను కొన్ని రోజుల క్రితం జనవరి 14 వ తేదీన విడుదల  చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది,  కాకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ దేశంలో కరోనా కేసులు ఉధృతంగా పెరుగుతుందో ఈ సినిమా విడుదలను చిత్ర బృందం వాయిదా వేసింది, ఇప్పటి వరకు ఈ సినిమా కొత్త విడుదల తేదీని చిత్ర బృందం ప్రకటించలేదు.

 ప్రభాస్ ఈ సినిమాలతో పాటు సలార్, ఆది పురుష్,  ప్రెజెక్ట్ కే సినిమాలలో కూడా నటిస్తున్నాడు, ఈ సినిమాలో  ప్రాజెక్ట్ కే సినిమా పాన్ వరల్డ్ సినిమాగా తెరకెక్కుతోంది, ఈ సినిమాలతో పాటు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో కూడా ప్రభాస్ స్పీరిట్ మూవీ లో నటించబోతున్నాడు, వీటితో పాటు కరణ్ జోహార్ నిర్మాణంలో కూడా ప్రభాస్ ఒక సినిమాలో నటించబోతున్నాడు అని ఒక వార్తా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది,  ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి, ఇప్పటికే  నాగ్ అశ్విన్, ప్రభాస్ తో 'ప్రాజెక్ట్ కే' అనే సినిమాను దర్శకత్వం వహిస్తున్నాడు,  మరి  నాగ్ అశ్విన్ దర్శకత్వం లో కరణ్ జోహార్ నిర్మాతగా ప్రభాస్ హీరోగా తెరకెక్కబోయే సినిమాకు సంబంధించిన ఈ వార్త పై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: