మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లో ఎన్నో సార్లు ఒకే సినిమాలో తండ్రిగా కొడుకుగా రెండు పాత్రలలో నటించిన సందర్భాలు అనేకం ఉన్నాయి,  వాటిలో చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను కూడా సాధించాయి.  అయితే తాజాగా కూడా మెగాస్టార్ చిరంజీవి తండ్రిగా మరియు కొడుకు గా ఒకే సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది, బాబీ దర్శకత్వంలో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో  మెగాస్టార్ చిరంజీవి ఒక సినిమాలో నటిస్తున్న విషయం మన అందరికి తెలిసిందే, ఈ సినిమాలో చిరంజీవి ఒక పాత్రలో తండ్రిగా మరొక పాత్రలో కొడుకుగా నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి, ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.  అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమా తెరకెక్కబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే, అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కూడా ఒక పాత్రలో తండ్రిగా మరొక పాత్రలో కొడుకుగా నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి, ఇప్పటికే పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో గబ్బర్ సింగ్  సినిమాలో నటించాడు, ఈ మంచి విజయం సాధించడంతో భవదీయుడు భగత్ సింగ్ సినిమాపై  ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.  

ఇది ఇలా ఉంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా ఒక భారీ పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతున్న విషయం మన అందరికి తెలిసిందే, ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక పాత్రలో తండ్రిగా మరొక పాత్రలో కొడుకుగా  నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి, ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది, ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కొంత భాగం పూర్తి అయ్యింది,  ఇలా ఒకేసారి చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఒక పాత్రలో తండ్రిగా మరొక పాత్రలో కొడుకుగా నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: