మాస్ మహారాజ రవితేజ అంటే ఫుల్ ప్యాకేజ్డ్ ఎనర్జీ. ఇండస్ట్రీలో తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తూ.. స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. గతేడాది ‘క్రాక్’ సినిమాతో మంచి హిట్ అందుకున్న రవితేజ.. ఆ తర్వాత ‘ఖిలాడీ’ సినిమా షూటింగ్‌లో బిజీ అయ్యారు. ఈ సినిమా తర్వాత ‘రామారావు ఆన్ డ్యూటీ, టైగర్ నాగేశ్వరరావు, ధమాకా, రావణాసుర’ వంటి సినిమాలో నటించనున్నారు. అయితే ఖిలాడీ సినిమా ఫిబ్రవరి 11వ తేదీన రిలీజ్ కానుంది. ఈ మేరకు సినిమా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ పనులు ప్రారంభించింది. కాగా, ఖిలాడీ సినిమాను దర్శకుడు రమేష్ వర్మ డైరెక్ట్ చేశారు. అయితే దర్శకుడు రమేష్ వర్మ.. రవితేజపై పలు ఆసక్తికరమైన విషయాలను షేర్ చేశారు.


దర్శకుడు రమేష్ వర్మ, మాస్ మహారాజా రవితేజ కాంబినేషన్‌లో ఇప్పటికే ‘వీర’ సినిమా వచ్చింది. ఊహించిన స్థాయిలో ఈ సినిమా మాస్ ఆడియన్స్‌ ను మెప్పించలేకపోయింది. అయినా హీరో రవితేజ డైరక్టర్ రమేష్ వర్మకు మరో అవకాశం ఇవ్వడం గమనించవచ్చు. అయితే ఒక ఇంటర్వ్యూలో డైరెక్టర్ రమేష్ వర్మ.. రవితేజ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హీరో రవితేజ.. నిరాడంబరం, నిర్మొహమాటం, నిజాయితీ, నిబద్ధత కలిగిన వ్యక్తి అని పేర్కొన్నారు. రవితేజ నుంచి చాలా విషయాలు నేర్చుకోవాలన్నారు. సరిగ్గా బతకడం అంటే.. టైం వేస్ట్ చేసుకోకుండా మన పని మనం చేసుకోవడమని రవితేజే చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. ఆయన నటించిన సినిమాలో రిజెల్ట్ కంటే.. ఎఫెక్ట్స్ బాగా గుర్తిస్తారన్నారు.


ఖిలాడీ సినిమా స్టోరీ మంచి కిక్ ఇస్తుందన్నారు. ఈ సినిమాలో రవితేజను కొత్తగా చూస్తారని డైరెక్టర్ రమేష్ వర్మ పేర్కొన్నారు. రవితేజకు టైం వేస్ట్ చేయడం నచ్చదని, పని విషయంలో నిర్లక్ష్యం వహిస్తూ అస్సలు సహించడని తెలిపారు. చాలా ఓపెన్ మైండెడ్ అని. ఏ విషయం నచ్చకపోయినా.. తప్పు చేస్తే ముఖం మీదే చెప్పేస్తాడని అన్నారు. అయినా చాలా పాజిటివ్‌గా ఉంటారని వెల్లడించారు. కాగా, ఖిలాడీ సినిమా గతేడాదే విడుదల కావాలి. కరోనా కారణంగా పోస్ట్ పోన్ అయ్యిందని పేర్కొన్నారు. ఖిలాడీ సినిమా రవితేజ కెరీర్‌లో మంచి హిట్ మూవీగా నిలుస్తుందని డైరెక్టర్ రమేష్ వర్మ తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: