సినిమా ఇండస్ట్రీలో సీనియర్ హీరోలకు ఎప్పుడు హీరోయిన్ లతో ఇబ్బందులు ఎదురవుతూనే ఉంటాయి,  ఎందుకంటే యంగ్ హీరోయిన్ లతో సీనియర్ హీరోలు సినిమాలు చేసినట్లు అయితే సినిమాలో వారి  జంటను చూడడానికి ప్రేక్షకులు ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా వస్తుంది. అందుకోసమని వారి వయస్సుకు తగిన హీరోయిన్ లతోనే  సినిమాలలో నటించడానికి సీనియర్ హీరోలు ప్రాముఖ్యతను ఇస్తూ ఉంటారు, అందులో భాగంగా సీనియర్ హీరోలతో నటించడానికి ఏ ఇండస్ట్రీలో అయినా కాస్త తక్కువ మంది హీరోయిన్ లు మాత్రమే ఉంటారు. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా సీనియర్ హీరోలతో నటించడానికి తక్కువ మంది హీరోయిన్ లు మాత్రమే అందుబాటులో ఉన్నారు.

ఇందులో చూసుకుంటే తమన్నా ప్రస్తుతం చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న బోలా శంకర్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది, ఇప్పటికే తమన్నా 'సైరా నరసింహారెడ్డి'  సినిమాలో కూడా చిరంజీవితో కలిసి నటించింది,  అలాగే తమన్నా ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న ఎఫ్ త్రీ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది, ఇదివరకే తమన్నా, వెంకటేష్ హీరోగా తెరకెక్కిన ఎఫ్ టు సినిమాలో కూడా హీరోయిన్ గా నటించింది. కాజల్ అగర్వాల్ ప్రస్తుతం చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది, ఇదివరకే కాజల్ అగర్వాల్, చిరంజీవి హీరోగా తెరకెక్కిన ఖైదీ నెంబర్ 150 సినిమాలో హీరోయిన్ గా నటించింది
నయనతార ఇప్పటికే బాలకృష్ణ తో సింహ,  జై సింహ  సినిమాల్లో నటించింది,  ఈ ముద్దుగుమ్మ చిరంజీవి తో కూడా సైరా నరసింహారెడ్డి సినిమాలో హీరోయిన్ గా నటించింది, అలాగే వెంకటేష్, నాగార్జున లాంటి సీనియర్ హీరోలతో కూడా నటించి నయనతార సీనియర్ హీరోలకు బెస్ట్ ఆప్షన్ గా మిగిలింది. ఇలా వీరితో పాటు అనుష్క, శ్రేయ, త్రిష లాంటి మరికొంత మంది ముద్దుగుమ్మలు మాత్రమే టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్ లకు బెస్ట్ ఆప్షన్  లుగా మిగిలారు.

మరింత సమాచారం తెలుసుకోండి: