సూపర్ స్టార్ కమల్ హాసన్ డైరెక్షన్లో వచ్చిన చిత్రం.. హే రామ్. ఈ సినిమా రీసెంట్ గా 22 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో కమల్ హాసన్ ఒక సరికొత్త పాత్రలో నటించాడు.. కానీ ఈ సినిమా కమర్షియల్ గా డిజాస్టర్ మిగిల్చింది. ఈ సినిమాలో కమల్ హాసన్ హీరోగా మాత్రమే కాకుండా.. గెస్ట్ రోల్ గా షారుఖ్ ఖాన్ కూడా నటించడం జరిగింది. ఇక అంతే కాకుండా కొంత మంది బాలీవుడ్ హీరోలు కూడా నటించడం జరిగిందట. అప్పట్లోనే ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో బాగా పాపులర్ అయ్యి విడుదలైంది. కానీ ఈ సినిమా భారీ నష్టాలనే మిగిల్చిందట.. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ఒక స్టార్ హీరో రాబోతున్నాడు.. వాటి గురించి పూర్తి వివరాలను చూద్దాం.


హే రామ్ మూవీని బాలీవుడ్ నిర్మాత భరత్ సాహ్ రీమేక్ హక్కులను తీసుకున్నారు. ఆయన ఈ సినిమా రీమేక్ చేసేందుకు ధైర్యం చాలక అప్పట్లో వదిలేశాడు.. కానీ ఈ సినిమా రైట్స్ ను తాజాగా షారుక్ ఖాన్ దక్కించుకున్నాడు. ఈ సినిమాలో 22 సంవత్సరాల క్రితం తాను గెస్ట్ గా నటించాడు. ఇక అందుకోసమే ఈ సినిమాని విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నాడు షారుక్ ఖాన్.. ఇక షారుక్ ఖాన్ కి ఈ సినిమా పై ఎంత నమ్మకం ఉందో కాబట్టే ఈ సినిమాని రీమేక్ చేస్తున్నారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.అయితే షారుక్ ఖాన్ జీరో సినిమా తర్వాత ఒకేసారి నాలుగేళ్లు గ్యాప్ తీసుకున్నాడు.. అయితే అందులో కేవలం షారుక్ ఖాన్ రెండు సంవత్సరాలు మాత్రమే గ్యాప్ తీసుకోవాలనుకున్నప్పటికీ.. కరోనా వల్ల రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితులు అన్నీ సర్ద మునగడంతో షారుక్ ఖాన్ వరుసపెట్టి సినిమాలు చేయబోతున్నాడనే వార్త వినిపిస్తోంది. అందులో ఈ సినిమా కూడా ఒకటి ఉండబోతోంది అన్నట్టుగా వార్త వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: