మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో అతడు,ఖలేజా వంటి సినిమాలు వచ్చి ప్రేక్షకులను అలరించాయి. దీంతో వీరి కాంబినేషన్లో మరో సినిమా రాబోతోంది అని తెలిసిన దగ్గర్నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈసారి మహేష్ బాబు తో అదిరిపోయే యాక్షన్ ఎంటర్టైనర్ ని తెరకెక్కించబోతున్నాడు త్రివిక్రమ్. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా బుట్టబొమ్మా పూజ హెగ్డే హీరోయిన్ గా తీసుకున్నారు. అలాగే ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ మహేష్ బాబుకు విపరీతంగా నచ్చేసిందట.

అయితే ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలు కావాల్సి ఉంది. కానీ ఇటీవల మహేష్ బాబు కరోనా బారిన పడటంతో షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ఇక ప్రస్తుతం మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.ఈ సినిమాలో మహేష్ బాబు  సరికొత్తగా కనిపించబోతున్నాడు. సినిమాలో మహేష్ సరసన కీర్తీ సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఏప్రిల్ 1న ఈ సినిమా విడుదల కానుంది. ఇక త్రివిక్రమ్ సినిమాలో మహేష్ సరసన ఇద్దరు హీరోయిన్స్ ఉండనున్నట్లు సమాచారం. ఇప్పటికే మెయిన్ హీరోయిన్ గా పూజా హెగ్డేను సెలెక్ట్ చేశారు.

అయితే ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా మహేష్ బాబు కి మరదలిగా మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మలయాళ ముద్దుగుమ్మ 'భీమ్లా నాయక్' సినిమాలో రానా కి భార్య గా నటిస్తోంది. భీమ్లా నాయక్ సినిమాకి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ని త్రివిక్రమ్ అందిస్తున్నారు.అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలోనే సంయుక్త మీనన్ కు ఫిదా అయిన త్రివిక్రమ్.. మహేష్ సినిమాలో ఛాన్స్ ఇచ్చినట్లుగా ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తుంది. దీంతో మహేష్ సినిమాలో పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్గా.. సంయుక్త మీనన్ సెకండ్ హీరోయిన్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: