టాలీవుడ్ లో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తర్వాత ఆయన కుటుంబం నుంచి వచ్చిన వాళ్లలో సినిమాల్లో అతని వారసత్వాన్ని ఎవ్వరూ సరిగ్గా నిలబెట్టలేకపోయారు. అతని కొడుకులైన మంచు విష్ణు, మంచు మనోజ్ ఇద్దరూ కెరీర్ ప్రారంభంలో ఎన్ని ఇబ్బందులు పడ్డారో తెలిసిందే. మధ్యలో కొన్ని ఇట్లు వచ్చినా.. ఆ ఫామ్ ను తర్వాత కొనసాగించలేకపోయారు. దాదాపు ఓ ఐదారు సంవత్సరాల నుంచి ఈ ఇద్దరు హీరోల నుంచి ఓ మోస్తరు స్థాయి సినిమా కూడా రాలేదు. ఇక మంచు లక్ష్మి గురించి అయితే చెప్పాల్సిన పని లేదు. ఒకప్పుడు భారీ విజయాలను అందుకున్న లక్ష్మీప్రసన్న పిక్చర్స్.. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పేరుతో కొత్త నిర్మాణ సంస్థను పెట్టి..

 గత రెండు దశాబ్దాల్లో చాలా సినిమాలను నిర్మించిన మంచు ఫ్యామిలీ వాటిలో లో రెండు మూడు సినిమాలు తప్ప మిగతా ఏవి అంతగా ఆడలేదు. అలా మొత్తంగా చూస్తే సినిమాల పరంగా మంచి ఫ్యామిలీకి భారీ నష్టాలు తప్ప లాభాలేవి లేవు. వారి సినిమా వ్యాపారం పూర్తిగా దెబ్బతీసింది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా పట్టు వదలని విక్రమార్కుడిలా తన ప్రయత్నాలను అసలు ఆపటం లేదు మంచు విష్ణు. కొత్తగా 24 ఫ్రేమ్స్ బ్యానర్పై శ్రీను వైట్లతో కలిసి ఢీ సినిమాకి సీక్వెల్ చేస్తున్నాడు ఈ హీరో. అయితే ఇప్పుడు తాజాగా మంచు విష్ణు మరో కొత్త సినిమా వ్యాపారంలోకి అడుగు పెట్టబోతున్నాడని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం మంచు విష్ణు 'అవా (ava)' ఎంటర్టైన్మెంట్ పేరుతో డిజిటల్ కంపెనీని మొదలుపెట్టినట్టు తెలుస్తోంది.

ఈ సంస్థలో ఓటీటీల కోసం వెబ్ సిరీస్ లతోపాటు బడ్జెట్ సినిమాలు కూడా తీయబోతున్నారట. కేవలం ఓటీటీ కోసమే ఈ సంస్థను మంచు విష్ణు ఏర్పాటు చేశాడట. కొత్త నటీనటులు, టెక్నీషియన్లను ప్రోత్సహించే ఉద్దేశంతోనే మంచు విష్ణు ఈ బిజినెస్ లోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఇప్పటికే దీనికి సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ వర్క్ అంతా పూర్తయిందట. త్వరలోనే ఈ సంస్థను లాంఛనంగా మొదలుపెట్టి వరుసగా వెబ్ సిరీస్ లను తీయబోతున్నారట.ఇక ఈ ప్రయత్నం విజయవంతం అయితే భవిష్యత్తులో మంచు ఫ్యామిలీ అంతా కలిసి స్వయంగా ఒక ఓటీటీనే మొదలుపెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: