టాలివుడ్ లో చాలా మంది స్టార్ హీరోలు ఉన్నారు.. వారంతా కూడా ఇప్పుడు భారీ బడ్జెట్ సినిమాలను చెస్తున్నారు. అలా హీరోలు చేసే సినిమాలు అన్నీ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు కావడం విశేషం.. ఇకపోతే బన్నీ, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలు బాలివుడ్ లో కూడా సినిమాలను చేసి అక్కడ కూడా స్టార్ హీరోలుగా పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు ఒక్కో సినిమాకు 150 కోట్లు రెమ్యునరేషన్ ను కూడా తీసుకున్నారు. పుష్ప సినిమా కోసం బన్నికి 100 కోట్లు అందిన విషయం తెలిసిందే.. ఇది నిజంగానే బన్ని కెరియర్ లో ఇదే బెస్ట్ చిత్రంగా చెప్పాలి..


తెలుగు చిత్ర పరిశ్రమలో పాన్ ఇండియా సినిమాలను చేస్తూ అధిక రెమ్యునరేషన్ కోసం ప్రయత్నిస్తున్న హీరో ల లిస్ట్ కాస్త ఎక్కువగానే ఉంది. ఈ విషయం పై ప్రత్యెకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు హీరోలు ఇలా బాలివుడ్ లో కూడా తమ సత్తా ఛాటుతూనే వస్తే  మన చిత్ర పరిశ్రమ బిజినెస్ ఓ రేంజ్ లో పెరుగుతుంది. ప్రస్తుతం చరణ్, తారక్ ఆర్ఆర్ఆర్ రిలీజ్ తర్వాత రెమ్యునరేషన్ ను భారీగా పెంచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ సినిమా వాయిదా పడిన విషయం తెలిసిందే..


మహేష్ బాబు రాజమౌళి సినిమాతో, పవన్ హరిహర వీరమల్లు సినిమాతో బాలీవుడ్ లో కూడా స్టార్ హీరో స్టేటస్ ను అందుకుంటామని నమ్ముతున్నారు. విజయ్ దేవరకొండ, నాని, రవితేజ కూడా పాన్ ఇండియా సినిమాలతో అక్కడా, ఇక్కడా మార్కెట్ ను పెంచుకునేందుకు ప్రయత్నిస్తూన్నారు. ఇకపోతే ఇదే దూకుడు వుంటే 2024 సంవత్సరం కు స్టార్ హీరోలు ఒక్కొక్కరూ 100 కోట్లు అందుకోవడం ఖాయం. 10 కోట్లు అందుకొనె మన హీరోలు ఇప్పుడు 100వరకు రెమ్యునరేషన్ పెంచెందుకు రెడీ అవ్వడం పై అభిమానులు సంతోషం వ్యక్తం చెస్తున్నారు...

మరింత సమాచారం తెలుసుకోండి: