మెగాస్టార్ చిరంజీవి కోడలు, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన గారు వివాదంలో ఇరుక్కున్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ ఉపాసన పైన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెటిజన్లే కాదు మెగా ఫ్యాన్స్ నుంచి కూడా తీవ్ర విమర్శలు ఎదుర్కుంటోంది ఉపాసన. గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఉపాసన ఒక గుడి గోపురం ఫోటోను తన ఫేస్ బుక్ పేజీలో పంచుకున్నారు. పెద్ద గుడి గోపురం పై దేవుడి విగ్రహాల మధ్యలో కొందరు సామాన్య ప్రజలు నిలుచున్నట్లుగా ఫోటో ఎడిట్ చేశారు.

గుడి గోపురం పై కొందరు ప్రజలు నిలుచొని ఉన్న ఆ ఫోటోలో తాను, తన భర్త రామ్ చరణ్ కూడా ఉన్నామని ఎక్కడ ఉన్నామో కనుక్కోండి అంటూ ఉపాసన తన ఫాలోవర్స్ ని కోరారు. ఆ ఫోటో తనకు ఎంతగానో నచ్చిందని, అలా ఎడిట్ చేసిన ఆర్టిస్ట్ ఎవరో తనకు నేరుగా మెసేజ్ చేస్తే అభినందించాలని ఉందంటూ ఉపాసన రాసుకొచ్చారు. దీంతో ఆ ఆలయంపై సామాన్య మనుషుల ఫోటోలను ఎడిట్ చేసి హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ ఉపాసన పై  ఫైర్ అవుతున్నారు నెటిజన్లు. ఉపాసన షేర్ చేసిన ఫోటోకు నెటిజన్ల నుంచి ఊహించని రిప్లై లు వస్తున్నాయి. మీరు ఎంత గొప్పవారైనా కావచ్చు కానీ, ఇలా దేవుడు గోపురాన్ని అడ్డుపెట్టుకొని ప్రచారం చేసుకోవడం తగదంటూ హితువు పలుకుతున్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.వెంటనే పోస్ట్ డిలీట్ చేయాలంటూ నెటిజన్లు, మెగా అభిమానులు సైతం డిమాండ్ చేస్తున్నారు. గుడి గోపురం మీద దేవతలు ఉండాల్సినటువంటి ప్రదేశంలో ఇలా సామాన్యుల ఫోటోలు పెట్టి హిందువుల మనోభావాలను ముఖ్యంగా హిందువులు పవిత్రంగా పూజించే దేవుళ్లను అవమానించినట్టుగా హిందువులు భావిస్తున్నారు. ఆమె పోస్ట్ పెట్టి ఇప్పటికి 24 గంటలు అవుతున్నా ఆ పోస్ట్ ను ఇంతవరకు డిలీట్ చేయకపోవడంతో ఆమెపై మరింత ఎక్కువగా విమర్శలు గుప్పిస్తున్నారు.

 మెగా ఫ్యాన్స్ ఆ ఫోటో ని డిలీట్ చేయాలంటూ రిక్వెస్ట్ చేస్తున్నా కూడా ఆమె నుండి ఎటువంటి స్పందన లేకపోవడం వల్ల ఆమెపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ ఫోటో ను ఎవరు ఎడిట్ చేశారనేది కూడా నెటిజన్లు తెలుసుకుంటున్నారు. మొత్తానికి అయితే ఉపాసన చేసిన పోస్ట్ మాత్రం ఇప్పుడు తీవ్ర వివాదానికి దారి తీసింది. మరి ఈ పోస్టును డిలీట్ చేస్తారా లేదా మళ్లీ ఏదైనా రిపోస్ట్ చేసి వారి మనోభావాలను ఏమైనా శాంతింపజేస్తారా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: