ఒక వారం క్రితం టాలీవుడ్ లో మెగాస్టార్ కుమార్తె శ్రీజ, అల్లుడు కళ్యాణ్ దేవ్ ల విడాకుల విషయం హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారు అంటూ వార్తలు వెల్లువెత్తాయి. అయితే ఇప్పుడు ఆ గొడవలన్నీ సర్దుకుని వారిద్దరూ సంతోషం గానే ఉన్నారని మరో వైపు న్యూస్ స్ప్రెడ్ అవుతోంది. ఇవన్నీ అటుంచితే ఇపుడు కళ్యాణ్ దేవ్ గురించిన కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. ఈ యంగ్ హీరో పూర్తి పేరు కళ్యాణ్ కానుగంటి. 1990 ఫిబ్రవరి 11 న కిషన్ కానుగంటి, జ్యోతి లకు జన్మించారు. ఇతడు హైదరాబాద్ వాస్తవ్యుడు.

మెగాస్టార్ ముద్దుల చిన్న కూతురు శ్రీజను వివాహం చేసుకుని మెగా ఇంటికి అల్లుడయ్యారు కళ్యాణ్ దేవ్. వీరికి ఇద్దరు కుమార్తెలు నివృత్తి, నవిక్ష. కళ్యాణ్ తన ఫ్యామిలీతో పాటు హైదరాబాద్, జూబ్లీ హిల్స్ లోని రోడ్ నంబర్ 30 లో తన సొంత భవనంలో నివసిస్తున్నారు. అయితే మెగా కుటుంబం లో ఉన్న అందరూ సినీ ఇండస్ట్రీలో ఏదో ఒక విధంగా రాణిస్తున్న వారు కావడం కళ్యాణ్ దేవ్ కు బాగా కలిసి వచ్చింది. అందుకే తన ఫ్రెండ్స్ ప్రోద్బలంతో తాను కూడా హీరోగా అవ్వాలని అనుకుని ఒక రోజు శ్రీజ తో మెగాస్టార్ చిరంజీవిని అడిగించారట.

అయితే ఈ విషయంలో మొదట చిరు నసిగినా ఆ తర్వాత కళ్యాణ్ దేవ్ ఆసక్తిని గమనించి ఒప్పుకున్నాడు. ఆ విధంగా 2018 లో విజేత చిత్రంతో తెలుగులో హీరోగా పరిచయం అయ్యి విజయాన్ని అందుకున్నారు. ఇతడు నటించిన లేటెస్ట్ మూవీ సూపర్ మచ్చి. ఇతను ఒక్కో చిత్రానికి 1 నుండి 2 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నారు. ఇప్పుడు కళ్యాణ్ ఒక మంచి హీరోగా స్టాండ్ అవ్వాలంటే సరైన హిట్ పడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: