పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి తెలుగు ఇండస్ట్రీలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవర్ స్టార్ తో కలిసి ఒక్క సినిమా అయినా చేయాలని ఎంతో మంది క్యూ కడుతూ ఉంటారు. అంతేకాకుండా చాలా మంది ఫిల్మ్ మేకర్స్ తమ జీవితంలో ఒక్కసారైనా పవన్ తో జతకట్టాలి అనుకుంటారు. అయితే హిట్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా పవన్ తో సినిమా అంటే నిర్మాతలకు సేఫ్ అనే టాక్ ఉంది. అంతేకాకుండా పవన్ సినిమాలు కలెక్షన్ల విషయంలో ఏమాత్రం వెనకడుగు వేయలేదు. అయితే ఓపెనింగ్స్ విషయంలో వసూళ్ళ రికార్డులు బద్దలు కొట్టే విషయంలో పవన్ కళ్యాణ్కి ఆయనే సాటి. ఇకపోతే ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక వైపు సినిమాలు మరో వైపు రాజకీయంలో చాలా బిజీగా ఉన్నాడు. అయితే ప్రస్తుతం పవర్ స్టార్ అనే సినిమాలో నటిస్తున్నాడు.

అయితే తాజాగా భీమ్లా నాయక్, హరిహర వీరమల్లు, భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమాలుచేస్తున్నాడు.  ఈ సినిమాలలో భీమ్లా నాయక్ అనే సినిమా షూటింగ్ పనులు ఇప్పటికీ పూర్తి కావడం జరిగింది. ఈ సినిమా విడుదలకు కూడా రెడీగా ఉంది. అయితే ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సి ఉంది కానీ రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ విడుదల అవుతుంది మనం ఈ సినిమా విడుదల వాయిదా వేయడం జరిగింది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఫిబ్రవరి 27వ తేదీన శివరాత్రి కానుకగా విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక అసలు విషయానికి వస్తే తను పనిచేస్తున్న నిర్మాతలకు కొన్ని కండీషన్లు పెడుతోందట మన పవర్ స్టార్. దాంతో వీరికి తలలు పట్టుకునే పరిస్థితి వచ్చింది. అయితే ఇప్పటి నుండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల విషయంలో కొన్ని మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది.  

అయితే ఇక నుండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించబోయే సినిమాలు కేవలం 60 రోజులు మాత్రమే కాల్ షీట్లు ఇవ్వాలని భావిస్తున్నాడట. అంతేకాకుండా అందులోనే సినిమా షూటింగ్ కంప్లీట్ చేయాలని నిర్మాతలకు కండిషన్ లు పెడుతున్నాడట పవర్ స్టార్. రెండు నెలలకు మించి ఒక్క రోజు కూడా ఎక్కువ సమయం సినిమాలకు  కేటాయించేది లేదు అని స్పష్టం చేశారట.హరీష్ శంకర్ మూవీతో పాటు సురేందర్ రెడ్డి సినిమాలకు సంబంధించి మొత్తం 60 రోజులు మాత్రమే కాల్ షీట్ ఇస్తానని చెప్పాడట. అయితే తాజాగా హరీష్ శంకర్ మూవీతో పాటు సురేందర్ రెడ్డి సినిమాలకు సంబంధించి మొత్తం 60 రోజులు మాత్రమే కాల్ షీట్ ఇస్తానని చెప్పాడట. అయితే ఈ విషయమై నిర్మాతలు చాలా టెన్షన్ పడుతున్నారు.అయితే 2024లో ఏపీలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయాలపై స్పెషల్ ఫోకస్ పెట్టాడట పవన్. ఇక ఈ నేపథ్యంలోనే ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: