దర్శకధీరుడు రాజమౌళి - ఎన్టీఆర్ కాంబినేషన్‌కు ఉన్న క్రేజే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో మూడు సినిమాలు రాగా అవి మూడు కూడా సూపర్ డూపర్ హిట్లుగా నిలిచాయి.ఇక తన ఈ మూడు సినిమాలు ఎన్టీఆర్ కెరీర్‌ను సరైన టైంలో టర్న్ చేశాయి. ఇకపోతే తాజాగా వీరి ఇద్దరి కాంబినేషన్లో ఆర్ ఆర్ ఆర్ సినిమా వస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.అయితే ఈ సినిమాని డీవీవీ ఎంటర్టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అగ్ర నిర్మాత డీవీవీ దానయ్య  400 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. జూనియర్ ఎన్టీఆర్ తో పాటుగా ఏ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కనిపించనున్నాడు.

అయితే ఈ సినిమాలో గత మూడేళ్లుగా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఎదురు చూస్తూ ఉండగా జనవరి 7న సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 14 భాషలలో ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది కానీ ఒమిక్రాన్ ఎఫెక్ట్‌తో మరోసారి వాయిదా వేయక తప్పలేదు.అయితే ప్రస్తుతం ఈ సినిమా  రిలీజ్ చేసేందుకు రెండు డేట్లు పెట్టుకున్నా.. ఎప్పటకీ వస్తుందో .. ఇంకెన్నాళ్లు వెయిట్ చేయాలో తెలియక ప్రేక్షకులు అసహనం, ఆగ్రహంతోనే ఉంటున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన అన్ని ప్రమోషన్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. అయినప్పటికీ ఈ సినిమాను విడుదల వాయిదా వేయడం వీరి అభిమానులకు ఏమాత్రం నచ్చలేదు. అయితే ఈ సినిమాలో  ఎన్టీఆర్ కొమరం భీంగాను, రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజుగాను నటించారు.

ఇక ఈ సినిమా 1920 బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఫిక్షనల్ పీరియాడికల్ సినిమాగా త్రిబుల్ ఆర్ తెరకెక్కింది. ఇక అసలు విషయానికి వస్తే తాజాగా జూనియర్ ఎన్టీఆర్  ఓ ఇంటర్వ్యూలో ఓ ఇంట్రస్టింగ్ విషయం చెప్పారు..... అదేంటి అంటే కొమరం భీంగా నటించిన ఎన్టీఆర్ తాను చరణ్ చేసిన అల్లూరి సీతారామరాజు పాత్ర చేయాల్సి వస్తే ఎలా ఉండేదో చెప్పాడు. అయితే సినిమాలో సీతారామరాజు ట్రైలర్ చూసినప్పుడు చరణ్ నిప్పుల మధ్యలో నుంచి దూకుతూ బాణం వేసే సీన్ తనకి చాలా బాగా వచ్చిందని.  రామ్చరణ్ స్థానంలో తను ఉండి ఆ పాత్రలో తను నటిస్తే ఆ అనుభూతి ఎంత బాగుండేదో... అని ఆ పాత్రపై తనకు ఉన్న ఇష్టాన్ని బయట పెట్టాడు. ఇకపోతే 1920ల్లో ఈ ఇద్దరు పోరాట యోధులు కలిసి బ్రిటీషర్లపై ఎలా పోరాటం చేశారో ? రాజమౌళి చూపించనున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

RRR