టాలీవుడ్ సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుంది రాశీ ఖన్నా.  అయితే పెద్ద హీరోల సరసన సినిమాల్లో అవకాశాలు దక్కించుకోవడం లో విఫలం అయ్యింది ఈమె. ఆమె నటించిన తొలి చిత్రం ఊహలు గుసగుసలాడే ప్రేక్షకులను విపరీతంగా అలరించడం తో పాటు ఈమెకు మంచి గుర్తింపు తీసుకువచ్చింది. టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన సినిమా తో పాపులారిటీ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత మంచి అవకాశాలు అందుకుంటుందని అనుకున్నారు. మొదట గ్లామర్ పాత్రలు పోషించడానికి వెనుకాడిన ఈమె ఆ తర్వాత మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆ తరహా లో పాత్రలు చేయడం మొదలు పెట్టింది. 

గ్లామర్ పాత్రలు పోషించడం మొదలు పెట్టిన తరువాత ఈ ముద్దుగుమ్మ వైపు యంగ్ హీరోలు చూశారు. ఈమెను తమ సినిమాలలో హీరోయిన్ గా పెట్టుకొని ప్రేక్షకులు నయనానందం పొందేలా చేశారు. అలా మంచి గుర్తింపు సంపాదించుకున్న తర్వాత రాశీ కన్నా పెద్ద హీరోలతో అవకాశాలు వస్తాయని భావించగా అనూహ్యంగా ఆమెకు అవకాశాలు రాకపోవడం ఒక్కసారిగా ఆమె అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఆమె కొన్ని క్రేజీ సినిమాలలో నటిస్తూ పెద్ద హీరోల సరసన అవకాశాలు దక్కించుకునే విధంగా ప్రయత్నాలు చేస్తుంది.

అలా గోపీచంద్ హీరోగా నటిస్తున్న పక్కా కమర్షియల్ సినిమా లో ఆమె హీరోయిన్ గా నటిస్తూండ గా మరొక వినూత్నమై న సినిమా లో కూడా ఆమె హీరోయి న్ గా నటిస్తూ ఉండడం విశేషం. అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో రాశీ హీరోయిన్ గా నటిస్తుండగా ఈ పాత్ర కోసం ఆమె భారీ స్థాయిలో కష్టపడుతుందట. తప్పకుండా ఈ సినిమా ఆమెకు మంచి పేరు తీసుకురావాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఇప్పటికైనా ఈ ముద్దుగుమ్మను పెద్ద హీరోలు కనికరిస్తారా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: