ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ వచ్చింది అంటే టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర స్టార్ హీరోల సినిమాలు సందడి చేస్తూ ఉంటాయి, తెలుగు స్టార్ హీరోలు కూడా తమ సినిమాలను సంక్రాంతి పండుగకు విడుదల చేయాలనే ఉద్దేశంతో అందుకు అనుగుణంగా తన సినిమా షూటింగ్ ను కూడా ప్లానింగ్ చేసుకుంటూ తమ సినిమాను సంక్రాంతికి విడుదల చేసేలా చూస్తారు. అయితే ఈ సంవత్సరం కూడా సంక్రాంతి పండుగకు ఆర్ఆర్ఆర్, రాదే శ్యామ్, భీమ్లా నాయక్, సర్కారు వారి పాట సినిమాలను విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం విడుదల తేదీలను అఫీషియల్ గా ప్రకటించాయి.  ఆ  తప్పుకున్నారు ఆతర్వాత ఆ తర్వాత ఒక్కో సినిమా సంక్రాంతి బరి నుండి తప్పుకుంది. సంక్రాంతి రేసులో ఏ పెద్ద సినిమాలు లేకపోవడంతో బంగార్రాజు, రౌడీ బాయ్స్, హీరో, సూపర్ మచ్చిసినిమాలు సంక్రాంతి బరిలో నిలిచాయి,  ఈ అన్ని సినిమాలలో ఒక బంగార్రాజు సినిమా మాత్రమే మంచి అంచనాలతో థియేటర్ లలో విడుదలైంది, బంగార్రాజు సినిమా సోగ్గాడే చిన్నినాయన సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కింది.

సినిమా  అంచనాలకు తగ్గట్టుగానే బాక్స్ ఆఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ ను సంపాదించుకొని కలెక్షన్ లను కూడా బాగానే రాబట్టింది.  అయితే మిగతా సినిమాలు అయిన రౌడీ బాయ్, హీరో, సూపర్ మచ్చి సినిమాలు పర్వాలేదు అనే రేంజ్ లో కలెక్షన్ లను సాధించాయి. ఇది ఇలా ఉంటే ప్రతిసారి సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ లో కలెక్షన్ల ను వసూలు చేసే తెలుగు సినిమాలు ఈసారి మాత్రం చాలా తక్కువ కలెక్షన్ లతోనే సంక్రాంతికి సర్దుకుపోవాల్సి వచ్చింది.  ఒకవేళ నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన బంగార్రాజు సినిమా కనుక ఈ సంక్రాంతికి విడుదల కాకపోయి ఉంటే ఈ సంక్రాంతి బాక్స్ ఆఫీస్ దగ్గర మరింత నిరుత్సాహంగా ఉండేది అని అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: