టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరు అయిన అక్కినేని అఖిల్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.  అఖిల్  'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'  సినిమాతో మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ తో  కెరియర్ లో మొదటి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న అక్కినేని అఖిల్ ప్రస్తుతం మరో బ్లాక్ బస్టర్ విజయం కోసం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఏజెంట్ మూవీ లో హీరోగా నటిస్తున్నాడు.  

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతుంది.  ఏజెంట్ సినిమాలో అఖిల్ రా ఏజెంట్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు లవర్ బాయ్ పాత్రలో కనిపించిన అఖిల్ ఈ సినిమాలో ఇంటెన్సివ్ పాత్రలో కనిపించబోతున్నట్లు  తెలిసింది.  ఈ మూవీ లో మమ్ముట్టి కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు.  కొన్ని రోజుల క్రితం ఈ మూవీ ని ఆగస్టు 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అఫీషియల్ గా ప్రకటించింది. ఇది వరకే కొన్ని సార్లు వాయిదా పడిన ఏజెంట్ సినిమా విడుదల , మరో సారి  కూడా వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది.

అలా ఏజెంట్ సినిమాను ఆగస్టు 12 వ తేదీన విడుదల చేయక పోవడానికి ప్రధాన కారణం,  మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ సినిమా  కూడా ఆగస్టు 12 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు వార్తలు వస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అలా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన గాడ్ ఫాదర్ సినిమా కూడా ఆగస్టు 12 వ తేదీన విడుదల అవుతున్నట్లు వార్తలు రావడంతో ఏజెంట్ సినిమా విడుదలను చిత్ర బృందం వాయిదా వేయనున్నట్లు తెలుస్తోంది.  ఇది ఇలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తుండగా ఈ  సినిమా మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ కి తెలుగు రీమేక్ గా తెరకెక్కుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: