సాధారణంగా హీరోలకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ అభిమాన హీరో సినిమా విడుదల అవుతుందంటే చాలు ఫ్యాన్స్ హంగామా మొదలు చేస్తూనే ఉంటారు. ఇక అలాంటి సమయంలో అభిమానులు సైతం తమ హీరో కోసం ఏదైనా చేయడానికి సిద్ధ పడుతూ ఉంటారు. అభిమానులు సైతం భారీ కటౌట్లను ఏర్పాటు చేస్తే.. థియేటర్ల వద్ద టపాసులు పేలుస్తూ చాలా హంగామా చేస్తూ ఉంటారు. ఇక ఇలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని స్టార్ డైరెక్టర్లు సైతం స్టార్ హీరో సినిమాలు కాస్త విభిన్నంగా తెరకెక్కిస్తు ఉంటారు.

ఇక అలాంటి చిత్రాలు ఫస్ట్ లుక్ నుంచి ట్రైలర్ విడుదల అయ్యే వరకు మంచి గా ఆకట్టుకునే విధంగా చూపించడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అంటూ తమ హీరోల సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని అప్డేట్ తెలుస్తూనే ఉంటుంది. కొన్నిసార్లు తన ఫ్యాన్స్ అడిగే క్వశ్చన్ లకు వారికి అనుగుణంగానే సమాధానాలు తెలియజేస్తూ ఉంటారు దర్శకులు. తాజాగా ప్రభాస్ అభిమాని ఒకరు తమ సినిమా అప్డేట్ కోసం.. డైరెక్టర్ కు సూసైడ్ లెటర్ రాయడం జరిగింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతుంది అందుకు సంబంధించిన లేఖ కూడా వైరల్ అవుతోంది.


ప్రస్తుతం ప్రభాస్ చేతి నిండా సినిమాలతో చాలా బిజీగా నే ఉన్నారు. ఇక అంతే కాకుండా ప్రస్తుతం కే జి ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో సలార్ చిత్రంలో నటిస్తున్నారు. షూటింగ్ కూడా చాలా వేగంగా జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్లు కూడా విడుదల అవ్వడం జరిగింది. అయితే ఆ తర్వాత ఇప్పటివరకు ఈ చిత్రం నుంచి ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో ఒక అభిమాని ఇలా చేయడంతో చిత్రబృందం స్పందిస్తారో చూడాలి మరి. మరి ఈ చిత్రం నుండి ఏదైనా గ్లింప్స్ కోసం ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: