ఇటీవల కాంట్రవర్సీ జరిగితేనే చాలామంది సినిమా వైపు చూస్తున్నారు. ఏదైనా సినిమాకి కాంట్రవర్సి జరిగితే ఆ సినిమా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. లేదంటే ఇలా వచ్చి అలా వెళ్లి పోతుంది. ఆ విధంగా ఇటీవల జరిగిన ఓ కాంట్రవర్సి ఓ సినిమాకు ఎంతో హెల్ప్ అయింది అని చెప్పాలి. ఆ కాంట్రవర్సి వల్లే ప్రతి ఒక్క ప్రేక్షకుడికి కూడా ఆ సినిమా చాలా బాగా దగ్గర అయ్యింది. మనం ఇప్పుడు దేని గురించి మాట్లాడుకుంటున్నామో అందరికీ అర్థమయ్యే ఉంటుంది. విశ్వక్ సేన్ హీరోగా నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం అనే సినిమా చేసిన కాంట్రవర్సీ అందరికీ తెలిసిందే.

ఇటీవల ఓ ఛానల్ కు మరియు హీరో విశ్వక్ కు మధ్య జరిగిన వివాదం లో విశ్వక్ బాగా ట్రెండ్ అయ్యాడు. సినిమా కు కూడా మంచి రీచ్ వచ్చింది.  ఈ నేపథ్యంలోనే దీని ప్రభావం సినిమాపై తప్పకుండా ఉంటుంది అని అందరూ అనుకున్నారు. ఆ విధంగా నే అనూహ్య రీతిలో ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడం ప్రేక్షకులను అలరించడంతో ఈ చిత్రం ఇంతటి స్థాయిలో విజయాన్ని అందుకోవడం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కుతుంది. అలా ఈ చిత్రానికి కష్ట పడ్డ చిత్రబృందం ఎంతో సంతోషాన్ని వ్యక్తపరుస్తుంది.

తాజాగా ఈ సినిమా యొక్క సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చి సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు అల్లు అరవింద్. ఆయన నిర్మాణంలో విస్వక్ ఓ సినిమా చేయబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే రానుంది. గీతా ఆర్ట్స్ సంస్థ లో యువ హీరోలు సినిమా చేయడం అనేది కొత్తేమీ కాదు. గతంలో చాలా మంది యువ హీరోలు ఈ తరహాలో సినిమాలు చేసి మరొక మెట్టు పైకి ఎక్కారు. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. మరి ఇంత మంచి అవకాశాన్ని విశ్వక్ ఎలా మలుచుకుంటాడో చూడాలి. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: