అల్లు అర్జున్ కలలో కూడా ఊహించని విధంగా పుష్ప సినిమా భారీ స్థాయిలో విజయాన్ని అందుకుంది. పోయిన ఏడాది డిసెంబర్ 17వ తేదీన విడుదలైన ఈ సినిమా ఎంతటి సంచలన విజయాన్ని అందుకుంటుందని ఎవరూ కూడా ఊహించలేదు. తెలుగునాట ఈ చిత్రం కు మంచి స్పందన వస్తుందని అనుకున్నారు. కానీ దేశవ్యాప్తంగా ఈ సినిమాకు ఇంతగా పేరు ప్రఖ్యాతలు వస్తాయని కూడా ఎవరూ అనుకోలేదు. అలా పుష్ప సినిమా అల్లు అర్జున్ కు భారీస్థాయిలో పేరు ప్రఖ్యాతలను తీసుకువచ్చింది.

సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు తెలుగులో కంటే నార్త్ లోనే ఎక్కువ పేరు ప్రఖ్యాతలు వచాయని చెప్పవచ్చు. ఎప్పుడైతే అక్కడ హిట్ టాక్ మొదలైందో అప్పటి నుంచి ఈ సినిమాకు భారీ రెస్పాన్స్ రావడం మొదలైంది. చాలామంది సెలబ్రిటీలు ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయడం మొదలుపెట్టారు. ఈ సినిమాలోని డైలాగులను చేస్తూ ఈ సినిమా ఇంత పెద్ద విజయం అయ్యేలా చేశారు. ఆ విధంగా అల్లు అర్జున్ కు పాన్ ఇండియా మార్కెట్ లో గ్రాండ్ గా ఎంట్రీ లభించింది.

అంతేకాదు అల్లు అర్జున్ కు తెలుగులో కూడా భారీ ఫాలోయింగ్ పెరిగేలా చేసింది పుష్ప సినిమా. ఇప్పుడు పుష్ప యొక్క రెండవ భాగం సినిమా అంతకుమించి ఉండేలా చిత్రబృందం ప్లాన్ చేస్తుంది. ప్రీ ప్రొడక్షన్ పనులను ఎక్కువ సేపు చేస్తుంది. ఈ నేపథ్యంలో పుష్ప రెండవ భాగం తెరకెక్కదానికి మరింత సమయం పడుతుండటంతో అల్లు అర్జున్ ఈ గ్యాప్ లో ఓ సినిమా చేసి ఉంటే బాగుండేది అని కొంతమంది అభిమానులు చెబుతున్నారు. వాస్తవానికి నవంబర్ లోనే పుష్ప సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తయింది. ఆ తర్వాత ఆరు నెలలు అల్లుఅర్జున్ ఖాళీగానే ఉన్నాడు. ఈ గ్యాప్ లో ఒక సినిమా చేస్తే బాగుండేది అని చెబుతున్నారు.. ఇప్పటికైనా బన్నీ ఒక చిన్న సినిమా చేయాలని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: