టాలీవుడ్ లెక్కల మాస్టారు
సుకుమార్ తన పంథాను మార్చుకుని సినిమాలు చేస్తూ భారీ విజయాలను సొంతం చేసుకుంటున్నాడు. క్లాస్ సినిమాలు చేసే ఈ దర్శకుడు గత రెండు సినిమాలుగా
మాస్ సినిమాలు చేస్తున్నాడు.
రామ్ చరణ్ హీరోగా
సుకుమార్ చేసిన రంగస్థలం
సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఆ తర్వాత
అల్లు అర్జున్ తో చేసిన పుష్ప చిత్రం ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ
సినిమా కి దేశం మొత్తం
ఫిదా అయిపోయింది. పాన్
ఇండియా చిత్రం గా ఈ
సినిమా విడుదల కాగా భారీ స్థాయిలో విజయాన్ని నమోదు చేసుకుంది.
ఈ నేపథ్యంలో
సుకుమార్ పుష్ప రెండవ భాగం
సినిమా పైనే ఇప్పుడు అందరి చూపు పడింది. ఈ
సినిమా కూడా సంచలన విజయాన్ని అందుకోవాలని
బన్నీ అభిమానులు భావిస్తూ ఉండగా వారి అంచనాలకు తగ్గట్లుగా పనులు చేస్తున్నాడట.
సుకుమార్ అయితే ఈ చిత్రం తర్వాత చేయబోయే సినిమాపై ఎంతో ఆసక్తిగా ఉన్నారు. విజయ్
దేవరకొండ తో ఆయన తన తదుపరి సినిమాలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మొత్తం పుష్ప
సినిమా పైన ఉంటాడు కాబట్టి
సుకుమార్ వచ్చే ఏడాది విజయ్
దేవరకొండ సినిమా గురించి ఆలోచన చేయబోతున్నాడని చెప్పవచ్చు.
అయితే ఈ సినిమాలో విజయ్
దేవరకొండ ను వేరే స్థాయి హీరోగా చూపించబోతున్నాడు అని అంటున్నారు. ఇప్పటిదాకా
మాస్ పాత్రలు ఎం తో అద్భుతంగా ఆవిష్కరించిన
సుకుమార్ విజయ్
దేవరకొండ ఆ అవతారంలో సరికొత్తగా చూపించబోతున్నారు. ఇండస్ట్రీలో ఇది ఒక పెద్ద విజయం సాధించడం ఖాయం అని చెబుతున్నారు. వరుస సినిమాలతో తమ స్థాయిని పెంచుకుంటూ మంచి మంచి సినిమాలు చేస్తున్న
హీరో విజయ్
దేవరకొండ ఈ సినిమాతో ఎలాంటి రేంజ్ కు ఎదుగుతాడు చూడా లి.