తెలుగు సినిమా పరిశ్రమలోనే కాదు అన్ని సినిమాల పరిశ్రమలలో నటీనటుల పుట్టినరోజు సందర్భంగా వారు నటించిన సినిమాల యొక్క అప్డేట్లు ఇస్తూ ఉంటారు మేకర్స్. అలా ఇప్పటి వరకు ఎంతో మంది హీరోల పుట్టినరోజు కానుకగా వారి వారి అభిమానులకు నచ్చేలా సినిమాకు సంబంధించిన అప్డేట్ లు విడుదల చేసి సదరు చిత్రంపై అంచనాలను పెంచేవారు. ఆ విధంగా ఎన్టీఆర్ పుట్టిన రోజు మరొక పది రోజులలో ఉన్న నేపథ్యంలో ఆయన అభిమానులు ఎన్టీఆర్ సినిమాలకు సంబంధించిన అప్డేట్ లు ఏమేమి వస్తాయి అన్న ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.

ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఎన్టిఆర్ నటించబోయే సినిమాలపై ఎవరికీ క్లారిటీ లేదు. కొరటాల శివ దర్శకత్వంలో ఆయన సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అన్న వార్త తప్ప దానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంతవరకు రాలేదు. అంతేకాదు బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ స్పోర్ట్స్ డ్రామా లో కూడా ఆయన నటించబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. కానీ దీనికి సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటన కూడా ఇవ్వడం జరగలేదు. దీంతో ఎన్టీఆర్ నటించబోయే సినిమా ఏమై ఉంటుందని అందరిలో ఎంతో ఆసక్తి నెలకొంది.

తాజాగా ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా రెండు కీలక ప్రకటనలు జరుగుతాయని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో అవి కొరటాల శివ మరియు బుచ్చిబాబు దర్శకత్వంలోని సినిమాలే అని చెబుతున్నారు. మరొక వైపు కొరటాల శివ ఎన్టీఆర్ తో చేయబోయే సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలు పెట్టడానికి మరికొన్ని రోజుల సమయం కావాలని కోరుతున్న నేపథ్యంలో ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా రాబోయే రెండు సినిమాల అప్ డేట్ లు ఏంటో చూడాలి. ఇకపోతే ఎన్టీఅర్ మాత్రం తన అప్ కమింగ్ సినిమాలను వెరైటీ గా చేసే విధంగా ప్లాన్స్ చేసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో అయన ఏ తరహ లో సినిమాలు చేస్తాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: