దర్శకుడు కొరటాల శివ అంటే 'ఆచార్య' సినిమాకి ముందు 'ఆచార్య' సినిమాకి తర్వాత అన్నట్లుగా అయిపోయింది వ్యవహారం. అవును ఇది నిజమే కదా ఆచార్య సినిమా ముందు వరకు కూడా కొరటాల శివ అంటే సెన్సేషనల్ దర్శకుడు, ఓటమన్నదే ఎరుగని సక్సెస్ఫుల్ డైరెక్టర్. మిర్చి, శ్రీమంతుడు, జనతాగ్యారేజ్, భరత్ అనే నేను వంటి సంచలన చిత్రాలను సృష్టించిన మహా దర్శకుడు. అయితే ఆచార్య సినిమా తరవాత సీన్ రివర్స్ అయ్యింది. ఊహించని రీతిలో విమర్శలను ఎదుర్కొంటున్నారు ఈ దర్శకుడు. అసలు అనుకున్నది అనుకున్నట్లు తీసి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని స్టోరీలో వారు జోక్యం చేసుకోకపోతే ఉంటే ఆచార్య చిత్రం అంచనాలను మించిన హైప్ ను అందుకుని ఉండేదని కొరటాల అభిమానులు, సన్నిహితులు అంటున్న మాట.

నిజానికి ఒకవేళ ఆచార్య సినిమా అంచనాలను అందుకోలేకపోయినా ఇంతటి నెగెటివిటి తనను చుట్టేస్తుందని దర్శకుడు కొరటాల కూడా ఊహించి ఉండరు. ఒక వైపు మెగా ఫ్యాన్స్ మరో వైపు సినీ లవర్స్ మరియు విశ్లేషకులు అంతా కలిసి కొరటాలపై విమర్శల జడివాన కురిపిస్తున్నారు. ఇప్పట్లో ఈ వెల్లువ తగ్గేలా కనిపించడం లేదు. మరి ఈ రేంజ్ లో కొరటాల బుక్ అవుతారని అసలు ఎవరు ఊహించనే లేదు. అయితే ఇంతటి పరాజయాన్ని అందుకుని సెంటర్ పాయింట్ అయిన కొరటాల తన తదుపరి చిత్రంలో మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. అనుకున్నది అనుకున్నట్లు స్క్రీన్ పై ప్రతిబింబించేలా ప్లానింగ్ చేస్తున్నారు.

తారక్ తో తను చేయబోయే చిత్రం ఆచార్య మిగిల్చిన నీలి ఛాయలను కనపడకుండా రంగులతో నింపేయాలని మరింత దృఢంగా నిశ్చయించుకున్నారట. ఇక తారక్ తో తాజా చిత్రం జనతా గ్యారేజ్ ను మించిన బలమైన కథతో అల్లుకుంటుందని తెలుస్తోంది. ఈ సినిమా బడ్జెట్ కూడా భారీగానే ఉందనితుందట. దాదాపు 150 కోట్లకు పైగా ఈ సినిమాకి బడ్జెట్ ఫైనల్ చేసినట్లు సమాచారం. వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్ ట్రీట్ గా ఈ ప్రాజెక్ట్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రణాళికలు జరుగుతున్నట్లు సమాచారం. మొత్తానికి ఆచార్య చిత్రంతో బాగా అలెర్ట్ అయ్యారు కొరటాల.

మరింత సమాచారం తెలుసుకోండి: