మాస్ కా దాస్ విశ్వక్ సేన్ అభిమానులకీ అలాగే రౌడీ హీరో విజయ్ దేవరకొండ అభిమానులకీ గతంలో పెద్ద గొడవే జరిగింది. దానిక్కారణం కూడా విశ్వక్ సేన్ కావడం విశేషం.

విజయ్ దేవరకొండ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ, విశ్వక్ సేన్ సోషల్ మీడియాలో ఓ వీడియో పెట్టడంతో 'రౌడీస్' తెగ రచ్చ రచ్చ చేసేశారు. ఆ వివాదం ఆ తర్వాత అయితే సద్దుమణిగింది.

ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియాలో విశ్వక్ సేన్ అభిమానుల కీ అలాగే విజయ్ దేవరకొండ అభిమానులకీ మధ్య పంచాయితీ నడుస్తోంది. చిన్న సినిమాలతో చాలా పెద్ద విజయాల్ని విశ్వక్ సేన్ నమోదు చేస్తున్నాడనీ, స్టార్ డమ్ వచ్చినా విజయ్ దేవరకొండ మాత్రం సరైన సినిమాలు చేయలేకపోతున్నాడన్నది మాస్ కా దాస్ అభిమాను లు నిందిస్తున్నారట.

ఇంకోపక్క, విశ్వక్ సేన్ ఎప్పటికీ  కూడా స్టార్ హీరో అవలేడంటూ విజయ్ దేవరకొండ అభిమానులు కూడా 'సవాల్' చేస్తున్నారు. నటన పరంగా, స్టార్‌డమ్ పరంగా విజయ్ దేవరకొండ కాలి గోటికి కూడా విశ్వక్ సేన్ పనికిరాడన్నది రౌడీస్ వాదనట .

 
అసలు ఈ పోలికలు రెండు వైపుల నుంచీ ఎందుకు వస్తున్నాయ్.? స్టార్ డమ్ సంగతెలా వున్నా, విశ్వక్ సేన్ మంచి కథలే ఎంచుకుంటున్నారు. ఆయా సినిమాలకు టాక్‌తో సంబంధం లేకుండా మంచి లాభాలు వస్తున్నాయి.

నిజానికి, పెద్ద హీరో ల మధ్య నే ఇలాంటి వివాదాల్లేవు.. అవి ఒకప్పుడున్నా ఇప్పుడు అంతా కూడా సద్దుమణిగిపోతోంది. మల్టీస్టారర్ సినిమాలు కూడా బాగానే వస్తున్నాయి. విశ్వక్ సేన్, విజయ్ దేవరకొండ.. ఇద్దరూ వేర్వేరు స్థాయిల్లో సినిమాలు చేసుకుంటూనే వెళుతున్నారు. అభిమానులకెందుకీ పంచాయితీ.? అని సామాన్య ప్రేక్షకులు కూడా అభిప్రాయపడుతున్నారు.

తాజాగా విశ్వక్ సేన్ 'అశోక వనంలో అర్జున కళ్యాణం' సినిమా తో విజయాన్ని అందుకోగా, పాన్ ఇండియా సినిమా 'లైగర్'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడట విజయ్ దేవరకొండ.

మరింత సమాచారం తెలుసుకోండి: