పవన్ కళ్యాణ్ హీరోగా డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ఏమిటంటే.. గబ్బర్ సింగ్. ఇక గబ్బర్ సింగ్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ గా మారిపోయారు. ఇక ఈ సినిమాకి పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రంతో మంచి లాభాలను పొందారు బండ్లగణేష్. అందుకు గుర్తుగా ఈ సినిమా కి బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ కు ఒక బంగారుపు వస్తువు కూడా ఇచ్చాడు. ఇప్పుడు తాజాగా ఈ సినిమా విడుదలై 10 సంవత్సరాలు కావడంతో బండ్లగణేష్ డైరెక్టర్ హరీష్ శంకర్ కు ఒక ఖరీదైన గిఫ్ట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.


నిన్నటి రోజున ఈ చిత్రం విడుదలై 10 ఏళ్లు పూర్తి కావస్తోంది ఈ సందర్భంగా నిర్మాత బండ్ల గణేష్ డైరెక్టర్ హరీష్ శంకర్ కు ఖరీదైన బహుమతిని గిఫ్టుగా ఇచ్చాడట. ఒమేగా బ్రాండ్ కు చెందిన సిమాస్టార్ ప్రొఫెషనల్ వాచ్ ని గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది. ఈ వాచ్ ని హరీష్ శంకర్ ను డైరెక్టుగా కలిసి.. బండ్ల గణేష్ ఈజిప్టును అందజేయడం జరిగింది. దీని ధర దాదాపుగా రూ.5 లక్షల రూపాయలు ఉంటుందట.

ఈ సందర్భంగా బండ్ల గణేష్ కి ధన్యవాదాలు కూడా తెలియజేశారు హరీష్ శంకర్. థాంక్యూ నా బ్లాక్ బాస్టర్ ప్రొడ్యూసర్ అంటూ బండ్ల గణేష్ కి తెలియజేశాడు. గబ్బర్సింగ్ సినిమాకి నిర్మాణ సమయంలో అద్భుతమైన సహకారాన్ని అందించి నందుకు మీరు మాకు ఎల్లప్పుడూ స్పెషలే అని తెలియజేశారు. మీరు లేకపోతే ఇంత ఫాస్ట్ గా సినిమా తీయడం సాధ్యం కాదని నా అంకితభావానికి ప్రేమకి ధన్యవాదాలు అంటూ తెలియజేశాడు హరిశంకర్. ప్రస్తుతం ఈ ట్వీట్ కాస్త వైరల్ గా మారుతుంది. ఇక ఈ విషయం పై బండ్ల గణేష్ బాబు స్పందిస్తూ ఎన్నో జన్మల పుణ్య ఫలం ఈ సినిమా నిర్మాణం అంటూ తెలియజేశాడు. ఈ చిత్రంతో పవన్ కళ్యాణ్ తిరిగి తన స్టార్ డమ్ సంపాదించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: