దర్శకుడు ప్రశాంత్ నీల్ గురించి సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.  కే జి ఎఫ్ చాప్టర్ 1 సినిమాతో ఇండియా వైడ్ గా దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్  'కే జి ఎఫ్ చాప్టర్ 2'  మూవీ విజయం తో ఆ క్రేజ్ ను మరింత బలపరచు కున్నాడు. కే జి ఎఫ్ 1 మరియు 2  సినిమాలతో ఇండియా వైడ్ గా దర్శకుడిగా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సలార్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే.  

కే జి ఎఫ్ చాప్టర్ 2 సినిమా విడుదలకు ముందే ప్రశాంత్ నీల్  'సలార్' సినిమా షూటింగ్ ని ప్రారంభించాడు.  ఈ సినిమాలో ప్రభాస్ సరసన అందాల ముద్దుగుమ్మ శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. సలార్ సినిమా లోని శృతి హాసన్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ ను కూడా చిత్ర బృందం ఇప్పటికే విడుదల చేశారు.  ఇది ఇలా ఉంటే ఇప్పటికే షూటింగ్ ప్రారంభం అయి కొంత భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న సలార్ సినిమా స్క్రిప్ట్ లో ప్రశాంత్ నీల్ కొన్ని మార్పులు , చేర్పులు చేస్తున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

సలార్ సినిమా స్క్రిప్ట్ లో మార్పులు ,  చేర్పులు చేయడానికి ప్రధాన కారణం...  ఇప్పటికే కే జి ఎఫ్ చాప్టర్ 1 మరియు 2 లు  భారీ సక్సెస్ ను సాధించడంతో సలార్ సినిమాపై  ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.   ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో కోసం ప్రశాంత్ నీల్  'సలార్'  సినిమా స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు , చేర్పులు చేస్తున్నట్టు ఒక వార్త వైరల్ అవుతుంది.  ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ సినిమాపై ప్రభాస్ అభిమానులతో పాటు మామూలు సినీ అభిమానులు కూడా భారీ అంచనాలను పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: