మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆర్ సి 15' సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. రామ్ చరణ్ ,  దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆర్ ఆర్ ఆర్' సినిమా విడుదల కాకముందే శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నాడు.  ఇప్పటికే రామ్ చరణ్ , శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ కొంత భాగం పూర్తి అయ్యింది.  కొన్ని రోజుల క్రితం అమృత్ సర్ లో 'ఆర్ సి 15' మూవీ కి సంబంధించిన కాలేజీ సన్నివేశాలను చిత్రీకరించారు.

అమృత్ సర్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'ఆచార్య'  సినిమా ప్రమోషన్ లలో పాల్గొన్నాడు.  ప్రస్తుతం 'ఆర్ సి 15' మూవీ షూటింగ్ వైజాగ్ లో జరుగుతుంది.  ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. అసలు విషయంలోకి వెళితే...  శంకర్ సినిమా అంటే పాటలు ఏ రేంజ్ లో  ఉంటాయో మన అందరికీ తెలిసిందే.  శంకర్ తన సినిమాలో  పాటలు చిత్రీకరించే విషయంలో ఖర్చుకు ఏ మాత్రం వెనకడుగు వేయకుండా విజువల్ వండర్ గా పాటలను చిత్రీకరిస్తూ ఉంటాడు.  

అయితే అదే రేంజ్ లో 'ఆర్ సి 15' లో  కూడా సాంగ్స్ ఉండనునట్లు తెలుస్తోంది. 'ఆర్ సి 15'  సినిమాలో మొత్తం ఆరు పాటలను ప్లాన్ చేసినట్లు , అందులో ఇప్పటికే రెండు పాటల చిత్రీకరణ కూడా పూర్తి అయినట్లు , మిగతా నాలుగు పాటలను మరి కొన్ని రోజుల్లో షూటింగ్ చేయనున్నట్లు అన్ని పాటలను కూడా శంకర్ స్టైల్ లో  చాలా భారీగా సీజీ మరియు సాంకేతిక పరిజ్ఞానంతో తెరకెక్కించబోతున్నట్లు  ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.  ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కీయారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా,  ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: