టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతూ వస్తున్నాయి. ఎక్కువ శాతం టాలీవుడ్  సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు నటించిన సినిమాలకు భారీ బడ్జెట్ లు అవుతున్నాయి.  అలా స్టార్ హీరోలు నటించిన సినిమాలకు భారీ బడ్జెట్ అవడానికి ప్రధాన కారణం...  స్టార్ హీరోలకు అత్యధిక రెమ్యూనరేషన్ ఉండడం , అలాగే స్టార్ హీరోలు ఉన్న కారణంగా ఇతర నటీనటులు,  సాంకేతిక నిపుణులు కూడా మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు ఉండడంతో స్టార్ హీరోలు నటించిన సినిమాల బడ్జెట్ ఎక్కువగా అవుతోంది.  

అలా స్టార్ హీరోలు నటించిన సినిమా లలో బడ్జెట్ ఎక్కువ అయిన కారణంగా ఆ బడ్జెట్ ను తిరిగి రికవరీ చేసుకునేందుకు టిక్కెట్ ధరలను పెంచుకునే వెసులు బాటును రెండు తెలుగు రాష్ట్రాలు కూడా సినిమాలకు ఇవ్వడంతో ఇది వరకు ₹100 ఉన్న టికెట్ ధర,  సినిమా విడుదల రోజు ఏకంగా 300 నుంచి 450 కి కూడా చేరుతుంది. ఇలా భారీ బడ్జెట్ సినిమాలకు టికెట్ రేట్లను భారీగా పెంచుతున్న సందర్భంలో 'ఎఫ్ 3'  చిత్ర బృందం మాత్రం ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 'ఎఫ్ 3'  మూవీ లో  వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించగా తమన్నా,  మెహరీన్ హీరోయిన్ లుగా నటించారు.  

ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం సమకూర్చాడు.  ఈ సినిమాను భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మించాడు.  ఇలా భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించినప్పటికీ టిక్కెట్ ధరలను పెంచి ప్రేక్షకులను ఇబ్బంది పెట్టకూడదు అనే  ఉద్దేశంతో టికెట్ రేట్లను పెంచకుండానే 'ఎఫ్ 3'  మూవీ ని విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించుకున్నట్లు సమాచారం

మరింత సమాచారం తెలుసుకోండి: