అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కీర్తి సురేష్ , రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన నేను శైలజ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు నేను శైలజ సినిమాలో కీర్తి సురేష్ తన అందచందాలతో,  నటనతో ప్రేక్షకులను ఫిదా చేయడంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో కీర్తి సురేష్ కు మంచి సినిమా అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా కీర్తి సురేష్ నటించిన మహానటి సినిమా మంచి విజయం సాధించడం మాత్రమే కాకుండా కీర్తి సురేష్ కు గొప్ప నటిగా పేరు,  ప్రతిష్టలను  తీసుకు వచ్చింది.  

కీర్తి సురేష్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలోని  టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతోంది.  కీర్తి సురేష్ కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ్ లో కూడా ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి తమిళనాట కూడా స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతోంది.  ఇది ఇలా ఉంటే తాజాగా కీర్తి సురేష్ సర్కార్ వారి పాట మూవీ లో హీరోయిన్ గా నటించింది.  ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించగా ఈ సినిమాకు పరశురామ్  దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఈ రోజు అనగా మే 12 వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల అయ్యింది. ఈ సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి సురేష్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది.  

తాజా ఇంటర్వ్యూ కీర్తి సురేష్ 'సర్కారు వారి పాట'  సినిమా గురించి మాట్లాడుతూ... కళావతి లాంటి క్యారెక్టర్ ఇంతకుముందు చేయలేదు.  అందుకే సర్కారు వారి పాట మూవీలో నటించడం చాలా సంతోషంగా అనిపించింది. పరశురామ్ దర్శకత్వం వహించిన సినిమాల్లో హీరోయిన్ పాత్రకు మంచి ప్రాధాన్యత ఉంటుంది.  ఈ సినిమా లోనూ కళావతి పాత్ర చాలా కీలకం.  సర్కారు వారి పాట లాంటి ఇంత పెద్ద కమర్షియల్  సినిమాలో ప్రాధాన్యత ఉన్న పాత్ర దొరకడం నా అదృష్టం.  ఈ సినిమా కథ విన్న వెంటనే ఓకే చెప్పాను అని కీర్తి సురేష్ తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: