ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా సొంత టాలెంట్ తో సినిమా ఇండస్ట్రీలో ఎదిగి ఇక ప్రస్తుతం మంచి పేరున్న హీరోగా కొనసాగుతున్న వారిలో అటు అడవి శేష్ కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. కాలిఫోర్నియాలో లక్షలు వచ్చే ఉద్యోగాన్ని వదిలేసి ఇక సినిమాల మీద ఆసక్తితో ఆఫీసుల చుట్టూ తిరగడం మొదలు పెట్టాడు అడవి శేష్. ఇక సొంతం అనే సినిమాతో ఒక చిన్న గెస్ట్ రోల్ లో నటించాడు. ఆ తర్వాత  కర్మ సినిమాకి డైరెక్టర్ గా పనిచేశాడు. ఇక పంజా సినిమాలో అడవి శేష్ కి మంచి పాత్ర దొరికింది  ఆ తర్వాత ఎన్నో అవకాశాలు కూడా వచ్చాయి. క్షణం అనే సినిమాతో ప్రేక్షకులు అందరి చూపు లో పడిపోయాడు అడవి శేషు.


 ఇక ఆ తర్వాత బాహుబలి సినిమాలో ఆఫర్ రావడం వెంటనే ఎవరు అనే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలో నటించడం.. గూడచారి అనే ఒక స్పై కథాంశంతో తెరకెక్కిన  సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో అడవి శేష్ కేవలం మంచి సినిమాలు మంచి పాత్రలు మాత్రమే చేస్తాడని ప్రేక్షకుల్లో బావనా వచ్చింది. అయితే ఇప్పుడు మేజర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
 ఇటీవలే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈ టీవీలో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడూ. ఇక ఈ షోలో విదేశాల నుంచి ఇక్కడికి వచ్చావు హాలీవుడ్లో ఎందుకు ట్రై చేయలేదు అంటూ కమెడియన్ అలీ అడుగుతాడు.


 అయితే హాలీవుడ్లో ఇండియన్స్ కి మంచి పాత్రలు ఇవ్వరు అంటూ అసలు సీక్రెట్ బయట పెట్టాడు అడవి శేష్. టెర్రరిస్ట్ పాత్రలు, పెట్రోల్ బంక్ లో పని చేసే సిబ్బంది పాత్రలు లాంటి చిన్న చిన్న పాత్రలు ఇచ్చి అవమానిస్తూ ఉంటారని. అందుకే అక్కడ ప్రయత్నాలు చేయకుండా నేరుగా తెలుగు ఇండస్ట్రీ కి వచ్చేసాను అంటూ తెలిపాడు అడవి శేషు. ఇప్పటివరకు హాలీవుడ్లో చేస్తున్న ఇండియన్ యాక్టర్స్ ఎవరికి కూడా మంచి పాత్రలు దక్కలేదు అని చెప్పుకొచ్చాడు. కాగా భారీ అంచనాల మధ్య తెరకెక్కిన మేజర్ సినిమా ప్రస్తుతం భారత సైనికుడూ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే..

మరింత సమాచారం తెలుసుకోండి: