సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న హీరోల పేర్లు ఏ ప్రేక్షకుడిని అడిగిన టక్కున చెప్పేస్తూ ఉంటారు. సినిమాల్లోకి వచ్చిన తర్వాత అందరికీ హీరోల పేర్లు తెలుస్తూ ఉంటాయి.  కానీ సినిమా ఇండస్ట్రీలో అందరూ హీరోలకు అసలు పేరు మాత్రం వేరే ఉంటాయి. ఇక ఇలా అసలు పేరు కేవలం కొంతమందికి మాత్రమే తెలుస్తూ ఉంటాయన్న విషయం తెలిసిందే. శివశంకర వరప్రసాద్ మెగాస్టార్ చిరంజీవి గాను.. భక్తవత్సలం నాయుడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గాను.. కళ్యాణ్ బాబు పవన్ కళ్యాణ్ గా ఇలా ఎంతో మంది హీరోలు నిజమైన పేరు తో కాకుండా  కేవలం స్క్రీన్ నేమ్ తో నే కొనసాగుతున్నారు.


 ఇలా ఇండస్ట్రీలో స్క్రీన్ నేమ్ తో కొనసాగుతున్న హీరోల అసలు పేరు చాలా మందికి తెలియదు.  అచ్చంగా ఇలాగే అటు ప్రస్తుతం యువ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న అడవి శేషు కూడా అసలు పేరు వేరే ఉందట. అందరూ అతని పేరు శేషు అని మాత్రమే అనుకుంటూ ఉంటారు. కానీ అడవి శేషు వాళ్ళ అమ్మానాన్నలు పెట్టిన పేరు వేరే ఉందట. ఇటీవలే ఆలీతో సరదాగా కాలక్రమంలో కి అడవి శేషు ఎంట్రీ ఇవ్వగా కమెడియన్ అలీ అడవి శేషు అసలు పేరు రివీల్ చేశాడు.


 అడవి శేష్ కార్యక్రమంలో ఎంట్రీ ఇవ్వగానే అడవి సన్నీ చంద్ర అంటూ అసలు పేరుతో పిలుస్తాడూ కమెడియన్ అలీ.  ఈ క్రమంలోనే షాక్ అయిన అడవి శేష్  న్నా రియల్ నేమ్ పట్టేశారు అంటూ చెబుతాడు. అసలు పేరు ఎందుకు మార్చుకున్నావ్ అని అడగడంతో.. తాను కాలేజీ డేస్ లో ఉన్న సమయంలో సన్నీ లియోన్ బాగా పాపులర్ అయింది. దీంతో నా ఫ్రెండ్స్ అందరూ కూడా సన్నీలియోన్ అంటూ పిలవడం మొదలుపెట్టారు.  దీంతో ఒకరోజు చిరాకు వచ్చి ఇకనుంచి నా పేరు సన్నీ చంద్ర కాదు నా పేరు మార్చుకున్న ఈ రోజు నుంచి శేషు అంటూ చెప్పేసాను. అప్పటినుంచి ఇక అందరు శేషు అని పిలవడం మొదలు పెట్టారు అంటూ అసలు సీక్రెట్ బయట పెట్టాడు అడవి శేషు.

మరింత సమాచారం తెలుసుకోండి: