రామ్‌ చరణ్‌ 'ట్రిపుల్ ఆర్' తర్వాత శంకర్‌ దర్శకత్వంలో పాన్ ఇండియన్ మూవీ చేస్తున్నాడు. దిల్‌ రాజు నిర్మాణంలో లార్జ్‌స్కేల్‌లో తెరకెక్కుతోందీ సినిమా. ఇక భారీ చిత్రాల దర్శకుడు శంకర్‌ తీస్తోన్న ఈ సినిమాకి నార్త్‌లో ప్లస్ అవుతుందని, కియారా అద్వానీని హీరోయిన్‌గా తీసుకున్నారు. ఇప్పటికే చరణ్, కియారా ఇద్దరూ కలిసి 'వినయ విధేయ రామ' సినిమా చేశారు. అయితే ఈ మూవీ ఫ్లాప్‌ అయినా చెర్రీ, కియారా కెమిస్ట్రీకి మంచి రెస్పాన్స్ వచ్చింది.

నాని ఈ మధ్య ఎక్కువగా పాన్‌ ఇండియన్‌ మార్కెట్‌ని ఫోకస్‌ చేస్తున్నాడు. 'శ్యామ్‌సింగ రాయ్' తెలుగుతో పాటు తమిళ్‌, కన్నడ, మళయాళీ భాషల్లో రిలీజ్ అయ్యింది. ఇక 'దసరా' సినిమా అయితే సౌత్‌తో పాటు నార్త్‌లోనూ రిలీజ్‌ కాబోతోంది. మొత్తం అయిదు భాషల్లో రాబోతోన్న ఈ సినిమాలో కీర్తి సురేశ్‌ హీరోయిన్‌గా చేస్తోంది.ఇంతకుముందు వీళ్లిద్దరి కాంబోలో 'నేను లోకల్' సినిమా వచ్చింది. బాక్సాఫీస్‌ దగ్గర సూపర్‌ హిట్‌ రెస్పాన్స్ తెచ్చుకుంది. మహేశ్‌ బాబు వీకెండ్‌ అగ్రికల్చర్‌ కాన్సెప్ట్‌తో సూపర్‌ హిట్‌ అందుకున్న సినిమా 'మహర్షి'. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మహేశ్‌, పూజా హెగ్డే జోడీగా నటించారు. ఇప్పుడు ఈ కాంబినేషన్‌లో మరో సినిమా వస్తోంది. త్రివిక్రమ్‌ సినిమాతో మహేశ్ బాబు‌, పూజా హెగ్డే కాంబినేషన్‌ రిపీట్‌ అవుతోంది.

స్టార్ హీరోలు ఎక్కువగా ఇమేజ్‌కి సెట్‌ అయ్యే హీరోయిన్స్‌తోనే సినిమాలు చేస్తుంటారు. స్టార్‌ లీగ్‌లో ఉన్నోళ్లనే ప్రిఫర్ చేస్తుంటారు. కానీ చాలా తక్కువ మంది హీరోయిన్లకి మాత్రమే టాప్‌ లీగ్‌లో చోటు దక్కుతుంది. ఇక ఈ స్టార్‌ కాంబినేషన్స్‌తో చాలా కాంబినేషన్స్ రిపీట్ అవుతున్నాయి. చిరంజీవికి కథలు, దర్శకులు క్యూ కడుతున్నారు గానీ, బాడీలాంగ్వేజ్‌కి సెట్ అయ్యే హీరోయిన్‌ దొరకడం కష్టమైపోతోంది. చిరు కంబ్యాక్‌ మూవీ 'ఖైదీ నం.150'కి చాలామందిని ట్రై చేసి ఫైనల్‌గా కాజల్‌ అగర్వాల్‌ని హీరోయిన్‌గా తీసుకున్నారు. ఇక కొరటాల శివ డైరెక్షన్‌లో చేస్తోన్న 'ఆచార్య' సినిమాకి పెద్దగా పరిశోధనలు చెయ్యకుండా డైరెక్ట్‌గా కాజల్‌ని హీరోయిన్‌గా తీసుకున్నారు. అలాగే 'సైరా'లో సెకండ్‌ హీరోయిన్‌గా చేసిన తమన్నాని 'బోళాశంకర్‌'కి రిపీట్ చేశాడు చిరు.

వెంకటేశ్‌, వరుణ్ తేజ్‌ హీరోలుగా వస్తోన్న సినిమా 'ఎఫ్3'. అనిల్‌ రావిపూడి డైరెక్షన్‌లో రూపొందుతోన్న ఈ సినిమాలో వెంకటేశ్‌తో తమన్న రెండోసారి జోడీ కట్టింది. ఇక వరుణ్‌తేజ్‌తో మెహరీన్‌ మరోసారి రొమాన్స్‌ చేసింది. 'ఎఫ్2' సీక్వెల్‌గా తెరకెక్కుతోందీ సినిమా. గోపీచంద్‌ కెరీర్‌లో చాలా స్టైలిష్‌గా కనిపించిన సినిమా 'జిల్'. రాధాక్రిష్ణ కుమార్‌ దర్శకత్వంలో స్టైలిష్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీలో రాశీ ఖన్నా హీరోయిన్‌గా చేసింది. ఆ స్టైలిష్‌ జోడీని 'పక్కా కమర్షియ్'తో రిపీట్‌ చేశాడు మారుతి. ఇక మధ్యలో గోపీచంద్‌, రాశి ఖన్నా కలిసి 'ఆక్సీజన్' సినిమా కూడా చేశారు. అయితే ఈ మూవీ ఆడియన్స్‌ని మెప్పించలేకపోయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: