నందమూరి హీరో బాలయ్య ఇప్పుడు సినిమాల స్పీడ్ ను పెంచాడు.. తాజాగా వచ్చిన అఖండ సినిమా తో బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేశాడు.అయితే ఆ సినిమా సక్సెస్ తర్వాత వరుస సినిమాలను చేసెందుకు కొత్త సినిమా కథలను వింటూన్నాడు. ఇప్పుడు మరో రెండు భారీ ప్రాజెక్టులను లైన్లో పెట్టాడు.ఎప్పుడూ సీనియర్ డైరెక్టర్లకు ఛాన్స్ ఇస్తూ వచ్చిన బాలయ్య ఈ సారి యంగ్ డైరెక్టర్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు.ప్రస్తుతం తన కెరీర్‌లోని 107వ చిత్రాన్ని దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.


ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా దర్శకుడు గోపీచంద్ రూపొందిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, తాజాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో మొదలైంది.. ఈ మేరకు హైదరాబాద్ లోని సారథి స్టూడియోలో వేసిన ఓ భారీ సెట్‌లో ఈ సినిమాకు సంబంధించి ఓ అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుంది. ఈ యాక్షన్ సన్నివేశాన్ని స్టంట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్‌లు కంపోజ్ చేస్తున్నారు.


ఇప్పటికే రెండు భారీ యాక్షన్ సీక్వెన్స్‌ల ను చిత్ర యూనిట్ పూర్తీ చేయగా, ఇప్పుడు మూడో యాక్షన్ సీన్ కోసం ప్లాను చేస్తున్నారు. ఈ సినిమా లో బాలయ్య రెండు విభిన్న గెటప్స్‌ లో కనిపిస్తుండగా, ఇప్పటికే రఫ్ లుక్‌లో ఉన్న బాలయ్య ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఇక మరొక లుక్ చాలా స్టైలిష్‌గా డిజైన్ చేశాడట దర్శకుడు గోపీచంద్. ఈ సినిమా లో అందాల భామ శృతి హాసన్ బాలయ్య సరసన తొలిసారి హీరోయిన్‌గా నటిస్తోండ గా, ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దాంతో సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: