నేను శైలజ వంటి చిత్రంతో మొదటిసారిగా తెలుగు తెరకు పరిచయమైంది కీర్తి సురేష్. ఆ తర్వాత మహానటి చిత్రంతో బ్లాక్ బాస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఇక అందులో సావిత్రి పాత్రలో ఒదిగిపోయి నటించడంతో ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది కీర్తి సురేష్. ఈ  మూవీ తర్వాత కీర్తి సురేష్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది అతి తక్కువ సమయంలోనే వరుస అవకాశాలు అందుకుంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. తాజాగా మహేష్ బాబు నటించిన సర్కార్ వారి పాట చిత్రంలో నటించింది.

ఇక ఈ చిత్రంలో కళావతి పాత్రలో అదరగొట్టేసింది అని చెప్పవచ్చు ఈ సినిమా ఈ రోజున విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది.. కొన్ని సినిమాలలో హీరోయిన్ గా నటిస్తూనే మరి కొన్ని చిత్రాలలో చెల్లెలి పాత్రలో కూడా నటిస్తోంది. పెద్దన్న సినిమాలో రజినీకాంత్ చెల్లెలిగా నటించింది. ఇప్పుడు తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్న భోళా శంకర్ సినిమాలో కూడా చిరంజీవికి చెల్లెలిగా నటిస్తోంది. అయితే వరుస ఆఫర్లతో ఇలా దూసుకుపోతున్న కీర్తి సురేష్ చెల్లెలి పాత్రలు చేయడం ఏమిటి అని చాలామంది నెటిజెన్స్ మండిపడుతున్నారు. ఈ విషయంపై కీర్తి సురేష్ స్పందించింది..

అయితే కీర్తిసురేష్ చెల్లెలి పాత్రలు చేయడానికి గల కారణాలు తెలియజేస్తూ ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేసింది. కీర్తి సురేష్ మాట్లాడుతూ భవిష్యత్తులో ఎలాంటి పాత్రలు వస్తాయో ఎవరు చెప్పలేము అందుచేతనే ఇప్పుడు వచ్చిన మంచి పాత్రలను వదులుకోవడం తనకు ఇష్టం లేదని అందుచేతనే చెల్లెలి పాత్రలు చేయడానికి అయినా సరే హీరోయిన్ గా నటించడానికి అయినా సరే సిద్ధమే అని తెలియజేసింది. ఎలాంటి పాత్ర అయినా అవకాశం దొరకడం చాలా కష్టమే అందుకే పెద్దన్న చిత్రంలో చెల్లెలి పాత్రలో చేశాను అలాగే మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కూడా చెల్లెలి పాత్రను చేయడానికి ఒప్పుకున్నానాను తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: