యూఎస్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు రికార్డు ఎవరూ కూడా చెరపలేనిది. మహేష్ బాబు నటించిన గత 10 సినిమాలు వన్ మిలియన్ వసూళ్లు సాధించాయి. సర్కారు వారి పాట సినిమాతో ఆయన మరో వన్ మిలియన్ మూవీ ఖాతాలో వేసుకున్నారు.ఇక కేవలం ప్రీమియర్స్ తోనే సర్కారు వారి పాట సినిమా ఆ మ్యాజిక్ ఫిగర్ కి చేరువైంది. లేటెస్ట్ సమాచారం ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే సర్కారు వారి పాట 10 లక్షల డాలర్ల వసూళ్లను క్రాస్ చేసింది. అలాగే ఇంకా కొన్ని ఏరియాల కలెక్షన్స్ రిపోర్ట్ అందాల్సి ఉండగా... 1 మిలియన్ డాలర్లను దాటేసిందని సమాచారం తెలుస్తుంది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు గత చిత్రం సరిలేరు నీకెవ్వరు $7.59 లక్షల ప్రీమియర్ వసూళ్లు సాధించింది. ఈ నేపథ్యంలో ఇది మహేష్ బాబుకి మరో సరికొత్త రికార్డు.సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీకి ఈ రేంజ్ వసూళ్లు సాధించడం పెద్ద విషయమేమి కాదు.



ఇక హైదరాబాద్ సిటీలో కూడా సర్కారు వారి పాట(Sarkaru Vaari Paata) నాన్ ఆర్ ఆర్ ఆర్ రికార్డుని సొంతం చేసుకుంది. దాదాపు రూ . 9 కోట్ల వసూళ్లని ఈ సినిమా సాధించింది.ఈ సినిమాపై ఉన్న హైప్ రీత్యా భారీగా బుకింగ్స్ నడిచిన నేపథ్యంలో ఫస్ట్ డే ఓపెనింగ్ ఫిగర్ సాలిడ్ గా ఉండే అవకాశం వుంది. కాగా ఫస్ట్ డే సర్కారు వారి పాట వరల్డ్ వైడ్ గ్రాస్ ఎంత ఉండనుందనేది రేపు చూడాలి.ఇక దర్శకుడు పరశురామ్ కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా సర్కారు వారి పాట సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా, సముద్ర ఖని, సుబ్బరాజ్, వెన్నెల కిషోర్ ఇంకా అలాగే సీనియర్ హీరోయిన్ నదియా కీలక రోల్స్ చేయడం జరిగింది.మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సర్కారు వారి పాట సినిమాకి సంగీతం అందించారు. మైత్రి మూవీ మేకర్స్, జి ఎమ్ బి ఎంటర్టైన్మెంట్స్ ఇంకా అలాగే 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: