చీకటి గదిలో చితక్కొట్టుడు సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయ్యి ఇక్కడి ప్రేక్షకులకు ఆకట్టుకునే ప్రయత్నం చేసిన నిక్కి తంబోలి ఇక్కడ కలిసి రాకపోవడంతో ప్రస్తుతం బాలీవుడ్‌లో తన మార్క్ సృష్టించుకోవడానికి చూస్తోందట.

బిగ్ బాస్ హిందీలో పాల్గొని రన్నర్ గా నిలిచిన ఆమె తెగ హంగామా సృష్టిస్తోంది. తాజాగా ఆమె ఒక సౌత్ దర్శకుడి మీద సంచలన వ్యాఖ్యలు చేసిందట. ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే 
 
తెలుగు సినిమాతో తెరంగేట్రం చేసిన నిక్కీ తంబోలి ఇప్పుడు హిందీలో తన లక్ చెక్ చేసుకుంటోందట. ఎప్పటికప్పుడు ఆమె సోషల్ మీడియాలో ఘాటైన అందాలతో కుర్రకారును ఆకర్షించే ప్రయత్నం తెగ చేస్తుంది. నిక్కి తంబోలి చేసిన సినిమాల్లో అనుకున్నంత స్థాయిలో సక్సెస్ మాత్రం అవ్వలేదు. తెలుగులో అయితే శ్రీవిష్ణు నటించిన 'తిప్పరా మీసం' సినిమాతో బిగ్ స్క్రీన్ కు పరిచయమైన నటి నిక్కీ తంబోలి ఆ తరువాత 'చీకటి గదిలో చితక్కొట్టుడు'లో ఒక బోల్డ్ పాత్రలో కూడా నటించింది.
 

అయితే ఆ తర్వాత కాంచన 3 సినిమాలో కూడా నటించింది కానీ ఆమెకు అనుకున్నంత క్రేజ్ మాత్రం దక్కలేదు. ఆ తర్వాత ఆమెకు ఇతర భాషల్లో కూడా మంచి ఆఫర్స్ అయితే వచ్చాయి కానీ ఏవీ ఒప్పుకోకుండా నిక్కీ హిందీ 'బిగ్ బాస్ 14' సీజన్ లో పాల్గొనడమే కాక రన్నరప్ గా నిలిచి అక్కడ మంచి క్రేజ్ కూడా తెచ్చుకుంది.

 

అయితే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చురుగ్గా కనిపించే ఈ బ్యూటీ అప్పుడప్పుడూ కొన్ని హాట్ ఫోటోలు కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఆమె తన తాజా ఇంటర్వ్యూలో దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో జరిగిన ఒక భయంకరమైన అనుభవాన్ని గుర్తుచేసుకుందట. ఆమె ఒక సౌత్ దర్శకుడిచే ఇబ్బందులు ఎదుర్కొందట.. ఇది తన జీవితంలో 'చెత్త అనుభవం' అని ఆమె పేర్కొంది.
 

ఓ సౌత్‌ డైరెక్టర్‌ నాతో ప్రవర్తించిన తీరు నాకస్సలు నచ్చలేదని పేర్కొన్న నిక్కీ సెట్స్‌లో నాతోపాటు ఉన్న డ్యాన్సర్స్‌ అందరినీ మెచ్చుకుంటున్నాడు కానీ నన్ను మాత్రం ఎక్కడినుంచి వస్తారో నీలాంటి వాళ్లు? అంటూ చులకన చేసి మాట్లాడాడని ఆమె చెప్పుకొచ్చింది.సదరు దర్శకుడి పేరు చెప్పడానికి ఇష్టపడని ఆమె తనను ఆయన ఎంతో ఇబ్బంది పెట్టాడని ఆమె పేర్కొంది.
 

అయితే అలా ఎందుకు చేశారు అని ప్రశ్నిస్తే నాకు ఆ విషయం తెలియదని నాకు వారి భాష రాదు కాబట్టి బహుశా అలా అని ఉండేవాడు ఏమో అని ఆమె చెప్పుకొచ్చింది . అతని పేరు చెప్పడానికి ఇష్టం లేదు కానీ నా జీవితంలో అత్యంత దుర్భరమైన అనుభవం ఇదే అని చెప్పుకొచ్చింది.. ఇంటికి వచ్చిన తర్వాత కూడా నేను చాలా ఏడ్చేదాన్ని ఈ విషయం మా అమ్మానాన్నలకు కూడా తెలుసని విదేశాల్లో షూటింగ్ చేస్తున్నప్పుడు అదే డైరెక్టర్ వల్ల నేను టార్చెర్ కూడా ఎదుర్కొన్నాను. అయినా సరే నేను ఏ రోజు మధ్యలో ఆపలేదు, ఎప్పటికైనా ఆయన టాలెంట్ గుర్తిస్తాడు అని అనుకున్నాను అనుకున్నట్టుగానే సదరు దర్శకుడు ఇప్పటికీ నాకు టచ్లోనే ఉన్నాడు అని ఆమె చెప్పుకొచ్చింది..

మరింత సమాచారం తెలుసుకోండి: